For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SL: కోహ్లీ X జయసూర్య.. డీఆర్‌ఎస్ విషయంలో వాగ్వాదం!(వీడియో)

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, శ్రీలంక తాత్కలిక హెడ్ కోచ్ జయసూర్య మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో వన్డేలో శ్రీలంక 32 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించింది. ఈ గెలుపుతో ఈ సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 240 పరుగులు చేసింది. అవిష్కా ఫెర్నాండో(62 బంతుల్లో 5 ఫోర్లతో 40), కామిందు మెండీస్(44 బంతుల్లో 4 ఫోర్లతో 40) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్(3/30) మూడు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్(2/33) రెండు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీసారు.

IND vs SL Virat Kohli s Intense chat with Sanath Jayasuriya over DRS Controversy

అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 42.2 ఓవర్లలో 208 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ రోహిత్ శర్మ(44 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. శుభ్‌మన్ గిల్(44 బంతుల్లో 3 ఫోర్లతో 35), అక్షర్ పటేల్(44 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44)పర్వాలేదనిపించారు. శ్రీలంక బౌలర్లలో జెఫ్రీ వాండర్సే(6/33) ఆరు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా.. చరిత్ అసలంక(3/19) మూడు వికెట్లు పడగొట్టాడు.

మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకునే క్రమంలో కోహ్లీతో జయసూర్య కాసేపు మాట్లాడాడు. ఈ ఇద్దరూ ఏ విషయంపై మాట్లాడుకున్నారనే విషయం క్లారిటీ లేనప్పటికీ.. డీఆర్‌ఎస్ గురించి మాట్లాడుకున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ డీఆర్‌ఎస్‌తో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అకిలా ధనుంజయ వేసిన 15వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌లో కోహ్లీ వికెట్ల ముందు దొరికిపోగా.. అంపైర్ ఔటిచ్చాడు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేసిన కోహ్లీ సానుకూల ఫలితాన్ని అందుకున్నాడు.

ప్యాడ్‌ను తాకే క్రమంలో బంతి బ్యాట్‌ను తాకినట్లు రీప్లేలో కనిపించింది. దాంతో టీవీ అంపైర్ నాటౌటిచ్చాడు. అయితే ఈ నిర్ణయంపై శ్రీలంక డ్రెస్సింగ్ రూమ్, ఆటగాళ్లు షాక్‌కు గురయ్యారు. బంతి కోహ్లీ బ్యాట్‌కు తాకలేదన్నట్లు సైగలు చేశారు. సనత్ జయసూర్య సైతం అంపైర్ల నిర్ణయాన్ని తప్పుబడుతూ ఆగ్రహం వ్యక్తం చేయడం కనిపించింది.

మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్ ఇచ్చే క్రమంలో కోహ్లీని ఆపిన జయసూర్య.. ఈ డీఆర్‌ఎస్ గురించి అడిగినట్లు వీడియోను చూస్తే అర్థమవుతోంది. జయసూర్య సందేహాలకు కోహ్లీ సమాధానం చెప్పుకోగా.. ఒకరి భుజాలను ఒకరు తట్టి ముందుకు సాగారు.

Story first published: Monday, August 5, 2024, 13:01 [IST]
Other articles published on Aug 5, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+