క్యాచ్ నేలపాలు చేయడంతో..
ధనుంజయ వేసిన 36వ ఓవర్‌లో ఓవర్ మిడ్ వికెట్ దిశగా సిక్స్‌బాది 46 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం అదే జోరును కొనసాగించిన విరాట్.. శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. అయితే రజితా బౌలింగ్‌లో విరాట్ ఇచ్చిన లాలిపాప్ క్యాచ్‌ను వికెట్ కీపర్ కుశాల్ మెండీస్ నేలపాలు చేశాడు. ఈ లైఫ్‌తో చెలరేగిన విరాట్ తనదైన షాట్లతో అలరించాడు. కేఎల్ రాహుల్(39), హార్దిక్ పాండ్యా విఫలమైనా.. అక్షర్ పటేల్ సాయంతో విరాట్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కసున్ రజితా వేసిన 47వ ఓవర్‌లో బౌండరీ బాదిన విరాట్.. అనంతరం క్విక్ సింగిల్‌తో 80 బంతుల్లో 45 వన్డే సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
సచిన్ రికార్డు బద్దలు..
ఈ సెంచరీతో విరాట్ కోహ్లీ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. శ్రీలంకపై అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్‌గా విరాట్ నిలిచాడు. తాజా సెంచరీ లంకపై విరాట్‌కు 9వది కాగా.. సచిన్ 8 శతకాల రికార్డును అధిగమించాడు. అంతేకాకుండా భారత్ వేదికగా అత్యధిక వన్డే సెంచరీలు బాదిన సచిన్ టెండూల్కర్(20) రికార్డును సమం చేశాడు. సచిన్ టెండూల్కర్ 457 వన్డే ఇన్నింగ్స్‌లో 49 సెంచరీలు బాదితే.. విరాట్ కోహ్లీ 257 ఇన్నింగ్స్‌ల్లో 45 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. ఇక వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 12500 రన్స్ చేసిన తొలి క్రికెటర్‌గా విరాట్ చరిత్ర సృష్టించాడు. సచిన్ టెండూల్కర్ 310 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్ సాధించగా.. రికీ పాంటింగ్ 328 మ్యాచ్‌ల్లో ఈ మైలు రాయి అందుకున్నాడు.
విచిత్రం ఏంటంటే..?
కాకతాళీయమో ఏమో కానీ విరాట్ తన చివరి వన్డే ఇన్నింగ్స్‌లో, తాజా మ్యాచ్‌లో 113 పరుగుల వద్దనే ఔటయ్యాడు. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో 113 పరుగులు చేసిన విరాట్.. బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు నమోదు చేశాడు. కోహ్లీ సెంచరీతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 373 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(67 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 83), శుభ్‌మన్ గిల్(60 బంతుల్లో 11 ఫోర్లతో 70) హాఫ్ సెంచరీలతో రాణించారు. శ్రీలంక బౌలర్లలో కసున్ రజితా మూడు వికెట్లు తీయగా.. దిల్షాన్ మదుషంక, చమిక కరుణరత్నే, డసన్ షనక, ధనుంజయ డిసిల్వా తలో వికెట్ తీసారు.


Click it and Unblock the Notifications
