
దరిద్రం నెత్తిన తాండవం..
టీ20 ప్రపంచకప్ ముందే టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని కోహ్లీ ప్రకటించగా.. మెగా టోర్నీలో టీమ్ ఘోర పరాజయం నేపథ్యంలో వన్డే సారథ్య బాధ్యతల నుంచి బీసీసీఐ తప్పించింది. ఆ తర్వాత సౌతాఫ్రికా పర్యటనలో టెస్ట్ సిరీస్ ఓటమితో సుదీర్ఘ ఫార్మాట్ సారథ్య బాధ్యతలు కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఇక కెప్టెన్సీ బాధ్యతలు లేకపోవడంతో కోహ్లీ బ్యాట్‌తో చెలరేగుతాడని, మునపటి విరాట్‌ను తలపిస్తాడని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌తో పాటు వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌ల్లోను కోహ్లీ విఫలమయ్యాడు.

కోహ్లీకే ఆడలేని బంతులు..
ఇక శ్రీలంకతో టీ20 సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న విరాట్.. తనకు ఇష్టమైన టెస్ట్ ఫార్మాట్‌లో చెలరేగుతాడని ఆశించినప్పటికీ అది జరగలేదు. మొహాలీ టెస్ట్.. తన కెరీర్ 100వ మ్యాచ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మాత్రమే ఆడిన విరాట్ కోహ్లీ.. 45 పరుగుల వద్ద ఎంబుల్దేనియా వేసిన సూపర్ బాల్‌కు క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఈ బంతిని ఏ మాత్రం అంచనా వేయలేకపోయిన కోహ్లీ తాను ఔటైన తీరును చూసి బిత్తరపోయాడు. లసిత్ ఎంబుల్దేనియా వేసిన ఫుల్లర్ లెంగ్త్ బాల్‌ను బ్యాక్ ఫుట్‌లో డిఫెన్స్ చేసే ప్రయత్నం చేసిన కోహ్లీ.. క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

పింక్ బాల్ టెస్ట్‌లోనూ..
ఇక తనకు ఇష్టమైన, రెండో సొంత మైదానంగా భావించే బెంగళూరులోనైనా కోహ్లీ సెంచరీ చేస్తాడనుకుంటే అది జరగలేదు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో చూడముచ్చటి కవర్ డ్రైవ్‌తో అలరించిన విరాట్ కోహ్లీ.. 23 పరుగులకే డిసిల్వా వేసిన సూపర్ డెలివరీకి వికెట్ల ముందు దొరికిపోయాడు. బ్యాటింగ్‌కు ప్రతికూలమైన ఈ పిచ్‌పై డిసిల్వా వేసిన లోయర్ బాల్‌ను కోహ్లీ అంచనా వేయలేకపోయాడు. మళ్లీ బ్యాక్‌ఫుట్‌లో ఆడే ప్రయత్నం చేసే విరాట్ వికెట్ సమర్పించుకున్నాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ సేమ్‌బాల్‌కు మళ్లీ అదే తరహాలో ఔటయ్యాడు. దూకుడుగా బ్యాటింగ్ ఆరంభించిన విరాట్ కోహ్లీ మంచి టచ్‌లో ఉన్నట్టే కనిపించాడు.

బ్యాక్‌ఫుట్‌లో ఆడుతూ..
ఎదుర్కొన్న రెండో బంతికి రెండు పరుగులు చేయడం, ఆ కాసేపటికే బౌండరీ కూడా బాదడంతో ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ చెలరేగుతాడని అంతా భావించారు. కానీ శ్రీలంక స్పిన్నర్ జయ విక్రమ వేసిన 36వ ఓవర్‌లో 13 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద విరాట్ కోహ్లీ వికెట్ల ముందు దొరికిపోయాడు. మళ్లీ బ్యాక్‌ఫుట్‌లో ఆడే ప్రయత్నంలోనే వికెట్ పారేసుకున్నాడు.
దాంతో అతను సెంచరీ చేయడానికి మరో 3 నెలల వరకు ఆగాల్సిందే. ఈ సిరీస్ అనంతరం ఐపీఎల్ ప్రారంభం కానుండగా.. మేలో ముగియనుంది. ఇక జూన్‌లో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఉండగా.. జూలైలో ఇంగ్లండ్ మళ్లీ టెస్ట్ సిరీస్ ఉంది. అప్పటి వరకు సెంచరీ కోసం కోహ్లీ ఆగాల్సిందే. ఇక కోహ్లీకే ఆడలేని బంతులు ఎదురవుతున్నాయని, దరిద్రం నెత్తిన తాండవం చేస్తుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications
