Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: గొప్ప మనసు చాటుకున్న విరాట్ కోహ్లీ! దివ్యాంగుడికి..

IND vs SL: Virat Kohlis Gesture For Specially-Abled Fan, Gifted His Jersey

మొహలీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి గొప్ప మనసు చాటుకున్నాడు. భారత జట్టును విపరీతంగా అభిమానించే ఓ దివ్యాంగుడికి తన టీషర్ట్‌ను బహుమతిగా అందించాడు. కరోనా బయో బబుల్ నేపథ్యంలో అతనితో మాట్లాడలేకపోయిన కోహ్లీ.. తన టీషర్ట్‌తో ఆనందపరిచాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. అభిమానులు కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. శ్రీలంక ఫస్ట్ టెస్ట్ విజయానంతరం ఈ ఘటన చోటు చేసుకుంది.

బస్సులో నుంచి దిగి..

మైదానం నుంచి భారత జట్టు హోటల్ గదికి వెళ్తుండగా.. అక్కడికి వచ్చిన ధరమ్ వీర్ పాల్ అనే అభిమానిని చూసిన విరాట్ బస్సులో నుంచి దిగి కానుకను అందజేశాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన ధరమ్‌వీర్‌ పాల్‌ పుట్టుకతోనే పోలియో బారిన పడ్డాడు. క్రికెట్‌ను ప్రాణంగా భావించే ధరమ్‌వీర్‌ టీమిండియా ఆడే ప్రతీ మ్యాచ్‌కు హాజరవుతుంటాడు. అంగవైకల్యం తనకు ఇష్టమైన క్రికెట్‌కు ఎన్నడూ అడ్డుపడలేదని.. అందుకే టీమిండియా ఆడే ప్రతీ మ్యాచ్‌కు ఎంతదూరమైనా వెళ్తుంటానని చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలోనే టీమిండియా ఆటగాళ్లకు ధరమ్ వీర్ పాల్ సుపరిచితుడయ్యాడు.

 థ్యాంక్యూ చాంపియన్..

థ్యాంక్యూ చాంపియన్..

ఇక విరాట్ కోహ్లీ ఇచ్చిన కానుకకు సంబంధించిన వీడియోనూ ధరమ్‌వీర్‌ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ‘ధన్యవాదాలు చాంపియన్‌.. నువ్వు ఎప్పటికి నా చాంపియన్‌వే.. ఇంకా కొన్నేళ్లు నీ ఆట నిరంతరాయంగా సాగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా'' అని క్యాప్షన్ ఇచ్చాడు. ఇక 2017లో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ధరమ్‌వీర్‌ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

సచిన్‌ పాజీ, ఎంఎస్‌ ధోనీ, యువరాజ్‌ సింగ్‌, సెహ్వాగ్‌, కోహ్లీ లాంటి ఆటగాళ్లతో మంచి సంబంధాలున్నాయని తెలిపాడు. ఎన్నోసార్లు తనకు సాయమందించారని, వారికి కృతజ్ఞతుడిగా ఉంటానని తెలిపాడు. ఇక మధ్యప్రదేశ్‌ దివ్యాంగుల క్రికెట్‌ జట్టుకు ధరమ్‌వీర్‌ పాల్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండడం గమనార్హం.

Virat Kohli 100th Test: Team India Success Mantra Kohli | IND v SL | Oneindia Telugu
జడేజా సూపర్ షో..

జడేజా సూపర్ షో..

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 222 పరుగుల ఇన్నింగ్స్‌ తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీకి కెరీర్‌లో 100వ టెస్ట్ కాగా.. రాక్‌స్టార్ జడేజా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక సెంచరీ చేస్తాడని భావించిన విరాట్.. 45 పరుగులతో సరిపెట్టాడు. మ్యాచ్ అసాంతం ఉత్సాహంగా కనిపించిన విరాట్.. అభిమానులను తనదైన శైలిలో అలరించాడు. అల్లుఅర్జున్‌ పుష్ప సినిమాలోని తగ్గేదేలే డైలాగ్ చెబుతూ అభిమానులను ఉత్సాహపరిచాడు.

Story first published: Tuesday, March 8, 2022, 13:05 [IST]
Other articles published on Mar 8, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+