Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: సూర్య పరుగుల సునామీ.. శ్రీలంకకు జంబలకిడి జారు మిఠాయే!

 IND vs SL: Suryakumar Yadav slams 3rd century as India set 229 target for Sri Lanka

రాజ్‌కోట్: టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(51 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 112 నాటౌట్) మరో సునామీ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. శ్రీలంకతో మూడో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగిన సూర్య.. టీ20 ఫార్మాట్‌లో మూడో సెంచరీ నమోదు చేసాడు. దాంతో లంక ముందు టీమిండియా 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. సూర్య విధ్వంసంతో శ్రీలంక బౌలర్లు పోటాపడి పరుగలిచ్చుకున్నారు. దాంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. సూర్యకు తోడుగా శుభ్‌మన్ గిల్(46), రాహుల్ త్రిపాఠి(35), అక్షర్ పటేల్(21 నాటౌట్) రాణించారు. లంక బౌలర్లలో మదుషంక రెండు వికెట్లు తీయగా.. కసన్ రజిత, కరుణరత్నే, హసరంగా తలో వికెట్ పడగొట్టారు.

రాహుల్ త్రిపాఠి షురూ..

రాహుల్ త్రిపాఠి షురూ..

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే ఇషాన్ కిషన్(1) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. మదుషంక వేసిన ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌కు ఇషాన్ స్లిప్‌లో చిక్కాడు. క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠితో శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను పరుగెత్తించాడు. వరుస బౌండరీలతో లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దాంతో టీమిండియా 5.4 ఓవర్లలో 50 పరుగులు పూర్తి చేసుకుంది. కరుణరత్నే వేసిన 6వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు బాదిన త్రిపాఠి అదే జోరులో థర్డ్ మ్యాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో పవర్ ప్లేలో టీమిండియా 2 వికెట్లకు 53 పరుగులు చేసింది.

సూర్య సునామీ ఇన్నింగ్స్..

సూర్య సునామీ ఇన్నింగ్స్..

అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్య.. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. ఓవర్‌కు ఓ బౌండరీ బాదుతూ.. స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. దాంతో టీమిండియా 10 ఓవర్లలోనే 92 పరుగులు చేసింది. తనకే సాధ్యమైన షాట్లతో సూర్య విరుచుకుపడటంతో శ్రీలంక ఫీల్డర్లు నివ్వెరపోయారు. కెప్టెన్ డసన్ షనక ఎన్ని ప్రయత్నాలు చేసినా.. సూర్య మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మదుషంక వేసిన 13వ ఓవర్‌లో 6, 4‌తో సూర్య.. 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మరింత ధాటిగా ఆడిన సూర్య.. ప్రతీ ఓవర్‌లో సిక్సర్ బాదుతూ లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు.

 మూడో సెంచరీతో చుక్కలే..

మూడో సెంచరీతో చుక్కలే..

హసరంగా.. శుభ్‌మన్ గిల్‌(46)ను ఔట్ చేయడంతో మూడో వికెట్‌కు నమోదైన 111 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా(4), దీపక్ హుడా(4) విఫలమైనా.. సూర్య తన జోరును ఆపలేదు. రజిత వేసిన 19వ ఓవర్‌లో సింగిల్ తీసిన సూర్య.. అంతర్జాతీయ టీ20ల్లో మూడో సెంచరీ అందుకున్నాడు. 45 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకొని రెండో వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత మరింత ధాటిగా ఆడిన సూర్య.. జట్టుకు భారీ స్కోర్ అందించాడు.

Story first published: Saturday, January 7, 2023, 21:01 [IST]
Other articles published on Jan 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+