Suryakumar Yadav సెంచరీ.. రికార్డులన్నీ బద్దలు! టీ20 చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా..!

రాజ్‌కోట్: టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మరో సంచలన ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. శ్రీలంకతో మూడో టీ20లో ఆకాశమే హద్దుగా ఆడిన సూర్య(51 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 112 నాటౌట్).. టీ20ల్లో మూడో శతకాన్ని అందుకున్నాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో సూర్య పలు రికార్డులను తన పేరిట లిఖించుకోవడంతో పాటు మరికొన్ని బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ టీ20ల్లో మూడు సెంచరీలు చేసిన తొలి నాన్ ఓపెనర్‌గా సూర్య చరిత్రకెక్కాడు. టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన జాబితాలో సూర్య.. రెండో స్థానంలో నిలిచాడు.
నాలుగు సెంచరీలతో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉండగా.. సూర్య మూడు సెంచరీలతో గ్లేన్ మ్యాక్స్‌వెల్, కొలిన్ మున్రోలతో సమంగా నిలిచాడు. టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండో భారత ప్లేయర్‌గా సూర్య రికార్డు సృష్టించాడు. ఇదే శ్రీలంకపై రోహిత్ శర్మ 35 బంతుల్లోనే సెంచరీ బాది అగ్రస్థానంలో ఉండగా.. సూర్య 45 బంతుల్లో ఈ ఘనతను అందుకొని రెండో స్థానంలో నిలిచాడు. అంతేకాకుండా 2023లో సూర్యకు తొలి సెంచరీ ఇదే. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచిన సూర్య.. కేఎల్ రాహుల్(2)ను అధిగమించాడు.
సూర్య విధ్వంసంతో శ్రీలంక బౌలర్లు పోటాపడి పరుగలిచ్చుకున్నారు. దాంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. సూర్యకు తోడుగా శుభ్‌మన్ గిల్(46), రాహుల్ త్రిపాఠి(35), అక్షర్ పటేల్(21 నాటౌట్) రాణించారు. లంక బౌలర్లలో మదుషంక రెండు వికెట్లు తీయగా.. కసన్ రజిత, కరుణరత్నే, హసరంగా తలో వికెట్ పడగొట్టారు.
26 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న సూర్యకుమార్ యాదవ్.. మరో 19 బంతుల వ్యవధిలోనే మూడెంకల స్కోర్ అందుకున్నాడు. శుభ్‌మన్ గిల్‌తో కలిసి మూడో వికెట్‌కు 111 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన సూర్య.. సునామీ ఇన్నింగ్స్‌తో జట్టు స్కోర్‌ను 200 పరుగుల మార్క్ ధాటించాడు. తనకే సాధ్యమైన సిక్స్‌లతో విరుచుకుపడిన సూర్య.. అభిమానులతో పాటు కామెంటేటర్లను ఫిదా చేశాడు. మదుషనక బౌలింగ్‌లో కిందపడుతూ సూర్య కొట్టిన సిక్సర్ ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications