మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న ఆఖరి మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక అన్నాడు.
'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. పిచ్ పొడిగా కనిపిస్తోంది. బ్యాటింగ్‌కు కష్టంగా ఉండే వికెట్ ఇది. బంతి పాత బడితే బ్యాటింగ్‌కు కష్టమవుతోంది. ఈ మ్యాచ్ కోసం మేం భిన్నమైన ప్రణాళికలు రచించాం. తుది జట్టులో ఒక మార్పు చేశాం. డసన్ షనక స్థానంలో చామిందు విక్రమసింఘే జట్టులోకి వచ్చాడు.'అని శ్రీలంక కెప్టెన్ చెప్పుకొచ్చాడు.

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. వర్ష ప్రభావ పరిస్థితుల్లో చేజింగ్ చేయాలనుకున్నామని చెప్పాడు. బంతిని కంట్రోల్ చేయడం బౌలింగ్ టీమ్‌కు ఇబ్బంది అవుతుందని తెలిపాడు. తుది జట్టులో నాలుగు మార్పులు చేశామని చెప్పిన సూర్యకుమార్ యాదవ్.. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రిషభ్ పంత్, అర్ష్‌దీప్ సింగ్‌లకు ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతినిచ్చినట్లు చెప్పుకొచ్చాడు.
బెంచ్ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపాడు. బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడటమే తమ లక్ష్యమని, ప్రతీ మ్యాచ్‌లో తమ బెస్ట్ వెర్షన్‌ను బయటకు తీస్తామన్నాడు.
మెడ నొప్పితో రెండో టీ20కి దూరమైన వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వగా.. రిషభ్ పంత్ స్థానంలో సంజూ శాంసన్, హార్దిక్ ప్లేస్‌లో శివమ్ దూబే తుది జట్టులోకి వచ్చారు. అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో ఖలీల్ అహ్మద్ బరిలోకి దిగగా.. అక్షర్ పటేల్ ప్లేస్‌లో వాషింగ్టన్ సుందర్ అవకాశాన్ని అందుకున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్‌ను భారత్ 2-0తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
తుది జట్లు:
భారత్: యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహమ్మద్ సిరాజ్, ఖలీల్ అహ్మద్.
శ్రీలంక: పాతుమ్ నిస్సంక, కుశాల్ మెండీస్, కుశాల్ పెరీరా, కామిందు మెండీస్, చరిత్ అసలంక, చామిందు విక్రమ సింఘే, వానిందు హసరంగా, రమేశ్ మెండీస్, మహీష్ తీక్షణ, మతీష పతీరణ, అసిత ఫెర్నాండో.