Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ.. అంతలోనే ఔట్.. ఓటమి దిశగా భారత్

Suryakumar Yadav out after maiden ODI fifty, Sri Lanka eye victory

కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ (44 బంతుల్లో 6 ఫోర్లతో 53)హాఫ్ సెంచరీ బాదాడు. తన ఫామ్‌ను కొనసాగిస్తూ శ్రీలంక బౌలర్లను ఆడుకున్నాడు. టీ20 ఫార్మాట్ తరహాలోనే కెరీర్ రెండో ఇన్నింగ్స్‌లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. కానీ ఆ జోరును కొనసాగించలేకపోయాడు. సందకన వేసిన 27 ఓవర్ తొలి బంతిని బౌండరీ తరలించిన సూర్య.. కెరీర్‌లో ఫస్ట్ వన్డే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

అయితే అదే ఓవర్‌ ఆఖరి బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగాడు. అప్పటి వరకు దూకుడుగా ఆడిన అతను ఆ బంతిని డిఫెన్సివ్ చేయబోయి వికెట్ల ముందు దొరికిపోయాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. బ్యాట్ కన్నా ముందే బంతి ప్యాడ్‌ను తగిలింది. దాంతో నిరాశగా పెవిలియన్ చేరాడు. సూర్య కూడా ఔటవ్వడంతో భారత్ ఓటమి దిశగా పయనిస్తోంది. 160 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులో కృనాల్ పాండ్యా(26 బ్యాటింగ్), దీపక్ చాహర్ ఉన్నారు.

అంతకుముందు ఓపెనర్ పృథ్వీ(13), వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్(1) తీవ్రంగా నిరాశపరిచారు. పృథ్వీ షాను డిసిల్వా .. ఇషాన్ కిషన్‌ను రజితా క్లీన్ బౌల్డ్ చేశారు. దాంతో 39 పరుగులకే భారత్ రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మనీశ్ పాండే(37)తో కెప్టెన్ శిఖర్ ధావన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. దాంతో పవర్ ప్లే ముగిసే సరికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. క్రీజులో కుదురుకున్న ఈ జోడీని డిసిల్వా విడదీశాడు.

జోరుమీదున్న ధావన్‌ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. దాంతో 65 పరుగులకే భారత్ మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్ రాగా.. మనీష్ పాండే ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నాడు. ఈ ఇద్దరు ధాటిగా ఆడటంతో భారత్ స్కోర్ బోర్డు పరుగెత్తింది. కానీ మనీష్ పాండే రనౌటవ్వడంతో 50 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. కృనాల్‌తో సూర్య పోరాడినప్పటికీ.. వికెట్లు ముందు దొరికిపోయాడు.

Story first published: Tuesday, July 20, 2021, 22:09 [IST]
Other articles published on Jul 20, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+