Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాకు ఇష్టమైన కెప్టెన్ అతనే: సూర్యకుమార్ యాదవ్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. తనకు ఇష్టమైన కెప్టెన్ రోహిత్ శర్మనేనని కొనియాడాడు. కెప్టెన్‌గా.. ఆటగాడిగా హిట్ మ్యాన్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపాడు. టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

దాంతో నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. సూర్యకుమార్ యాదవ్‌ను టీ20 కెప్టెన్‌గా ఎంపిక చేశాడు. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను కాదని, సూర్యకు టీ20 పగ్గాలు అప్పజెప్పాడు. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న టీమిండియా.. శనివారం పల్లెకెలె వేదికగా ఆతిథ్య జట్టుతో తొలి టీ20 ఆడనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్.. రోహిత్ శర్మపై ప్రశంసల జల్లు కురిపించాడు.

IND vs SL Suryakumar Yadav credits Rohit Sharma for captaincy he learnt a lot from him

'2014 నుంచి రోహిత్ శర్మతో కలిసి ఆడుతున్నాను. అతనితో నా ప్రయాణానికి దాదాపుగా 10 ఏళ్లు పూర్తయింది. హిట్ మ్యాన్ నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ముఖ్యంగా కెప్టెన్ అంటే ఎలా ఉండాలనేది అతని సారథ్యం చూసే నేర్చుకున్నా.

రోహిత్ శర్మ ఓ అసాధారణమైన నాయకుడు. రోహిత్ లాంటి కెప్టెన్‌ను నేను ఇప్పటి వరకు చూడలేదు. అతని సారథ్యంలో నాలాంటి ఎంతో మంది ఆటగాళ్లకు ఆదర్శం. ప్రస్తుత జట్టులో పెద్దగా ఏ మార్పు లేదు. కెప్టెన్సీలో మాత్రమే మార్పు వచ్చింది. రోహిత్ శర్మ అడుగుజాడల్లోనే నడిచేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తాను.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, July 26, 2024, 23:09 [IST]
Other articles published on Jul 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+