Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫిఫ్టీ.. శ్రీలంక ముందు సాధారణ లక్ష్యం!

Suryakumar, Shikhar Dhawan help

కొలంబో: సూర్యకుమార్ యాదవ్(34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50) సూపర్ ఫిఫ్టీకి శిఖర్ ధావన్(36 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 46) కెప్టెన్ ఇన్నింగ్స్ తోడవడంతో తొలి టీ20లో శ్రీలంక ముందు భారత 165 పరుగుల పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గబ్బర్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. సంజూ శాంసన్(20 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 27), ఇషాన్ కిషన్(14 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 20 నాటౌట్) పర్వాలేదనిపించగా.. హార్దిక్ పాండ్యా(10) తన వైఫల్యాన్ని కొనసాగించాడు. శ్రీలంక బౌలర్లలో దుష్మంత్ చమీరా, వానిందు హసరంగా రెండేసి వికెట్లు తీయగా.. చమిక కరుణరత్నే ఓ వికెట్ తీసాడు. స్లాగ్ ఓవర్లు కట్టిడిగా బౌలింగ్ చేయడంతో భారత్ సాధారణ స్కోర్‌కే పరిమితమైంది.

పృథ్వీ షా గోల్డెన్ డక్..

పృథ్వీ షా గోల్డెన్ డక్..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. అరంగేట్ర ప్లేయర్ ఓపెనర్ పృథ్వీ షా(0) గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. దుష్మంత్ చమీరా వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్ మరో ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలిసి ధాటిగా ఆడాడు. దాంతో పవర్ ప్లే ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. అయితే పవర్ ప్లే ముగిసిన వెంటనే శ్రీలంక కెప్టెన్ డసన్ షనక తన ట్రంప్ కార్డ్ హసరంగాను తీసుకురాగా.. తొలి బంతికే సంజూ శాంసన్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 51 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

సూర్య సూపర్ ఫిఫ్టీ..

సూర్య సూపర్ ఫిఫ్టీ..

క్రీజులోకి సూర్యకుమార్ యాదవ్ రాగా.. శిఖర్ ధావన్ నిదానంగా ఆడాడు. అయితే మరోవైపు సూర్య మెరుపులు మెరిపించడంతో భారత్ స్కోర్ బోర్డు పరుగెత్తింది. హసరంగా వేసిన 9వ ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టిన సూర్య.. ఉడాన బౌలింగ్‌లో మరో బౌండరీ బాదాడు. ఇక ధనుంజయ బౌలింగ్‌లో శిఖర్ 84 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. అయితే హాఫ్ సెంచరీకి చేరువైన శిఖర్ ధావన్.. కరుణరత్నే బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. అదే ఓవర్‌లో ఓ భారీ సిక్సర్ బాదిన సూర్య.. హసరంగా వేసిన మరుసటి ఓవర్‌లో మరో సిక్సర్ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

హార్దిక్ విఫలం..

హార్దిక్ విఫలం..

అయితే ఆ మరుసటి బంతికే మరో భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్.. హార్దిక్‌తో కలిసి ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. చమీరా బౌలింగ్‌లో బౌండరీ బాదిన ఇషాన్.. ఉడానా వేసిన 18వ ఓవర్‌లో భారీ సిక్సర్ కొట్టాడు. అయితే చమీరా బౌలింగ్‌లో మరోషాట్‌కు ప్రయత్నించగా.. బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్ వదిలేయడంతో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయితే ఆ మరుసటి బంతికే హార్దిక్ పాండ్యా(10) కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఈ టూర్‌లో పాండ్యా ఇప్పటి వరకు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. క్రీజులోకి కృనాల్ పాండ్యా రాగా.. చివరి ఓవర్ కరుణరత్నే కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బౌండరీలు రాలేదు. దాంతో భారత్ సాధారణ స్కోర్‌కే పరిమితమైంది.

Story first published: Sunday, July 25, 2021, 22:04 [IST]
Other articles published on Jul 25, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+