Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL తొలి టీ20ని లైట్ తీసుకున్న ఫ్యాన్స్.. స్టార్ స్పోర్ట్స్‌కు రూ.200 కోట్లు నష్టం!

IND vs SL: Star Sports Network lose 200 CR plus as Advertisers stay away from India vs SriLanka

న్యూఢిల్లీ: కొత్త ఏడాదిని టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీతో ప్రారంభించింది. శ్రీలంకతో మంగళవారం ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో 2 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ టీ20 సిరీస్‌కు కుర్రాళ్లతో కూడిన జట్టును బీసీసీఐ ఎంపిక చేయగా.. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు దూరంగా ఉన్నారు.

హార్దిక్ పాండ్యా సారథ్యంలో యువ ఆటగాళ్లతో కూడిన జట్టు తొలి టీ20 బరిలోకి దిగి సత్తా చాటింది. ఇక కోహ్లీ, రోహిత్ లేని ఈ మ్యాచ్‌ను ఫ్యాన్స్ లైట్ తీసుకున్నట్లు అర్థమవుతోంది. దాంతో స్టార్ స్పోర్ట్స్‌కు భారీ నష్టం వాటిల్లినట్లు వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి.

రూ.200 కోట్లు నష్టం..

రూ.200 కోట్లు నష్టం..

ఈ సిరీస్‌తో స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్‌స్టార్ దాదాపు రూ.200 కోట్లకు పైగా నష్టపోయినట్లు బ్రాడ్‌కాస్టింగ్ వర్గాలు తెలిపాయి. ఈ మ్యాచ్‌ మధ్యలో అడ్వర్జైజింగ్ ఇచ్చేందుకు కంపెనీలు అన్నీ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ మొత్తానికి కేవలం రెండు మూడు బ్రాండ్స్ మాత్రమే ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.

ఇక భారీ ధరకు బ్రాడ్ కాస్ట్ హక్కులను అందుకున్న స్టార్ నెట్‌వర్క్.. ఒక్క మ్యాచ్‌కు రూ.60.1 కోట్లను బీసీసీఐకి చెల్లిస్తుంది. అయితే స్టార్ స్పోర్ట్స్ 30-40 శాతం ఆదాయాన్ని అడ్వర్టైజ్‌మెంట్స్, సేల్స్, సబ్‌స్క్రిప్షన్ ద్వారానే ఆర్జిస్తోంది.

ఒక్క అడ్వైజర్ లేడు..

ఒక్క అడ్వైజర్ లేడు..

ఈ సిరీస్‌ పట్ల బడా కంపెనీలు ఆసక్తి కనబర్చటం లేదని చెప్పిన డిస్ని స్టార్ అధికారి ఒకరు.. మొత్తం రూ.200 కోట్లు‌కు పైగా నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నాడు. 'కొత్త ఏడాది తొలి సిరీస్‌కు ఏ మాత్రం ఊహించని స్పందన ఎదురైంది. చాలా మంది అడ్వర్టైజర్స్, ఏజన్సీస్ పెట్టు బడి పెట్టేందుకు భయపడుతున్నారు.

ఈ సిరీస్‌కు ఎదురవుతున్నపరిస్థితులు ఏమాత్రం ఊహించనివి. తొలి టీ20కి హాట్‌స్టార్‌లో ఒక్క అడ్వైజర్ లేడు. లైవ్ బ్రాడ్‌కాస్ట్‌కు కూడా 15-20 శాతం ఇన్వెంటరీ మాత్రమే అమ్ముడైంది.'అని సదరు అధికారి ఇన్‌సైడ్ స్పోర్ట్స్‌కు తెలిపారు. ప్రత్యక్షప్రసారానికి సంబంధించిన అడ్వర్టైజ్‌మెంట్సే కాదు.. గ్రౌండ్ స్పాన్సర్‌షిప్ కూడా దారుణంగా పడిపోయింది. ఈ ట్రెండ్ భవిష్యత్తు ద్వైపాక్షి సిరీస్‌లపై ఉన్న ఆసక్తిని తగ్గిస్తోంది.

కోహ్లీ, రోహిత్ లేకపోవడం..

కోహ్లీ, రోహిత్ లేకపోవడం..

ప్రస్తుతం మార్కెట్ విపత్క పరిస్థితులు ఎదుర్కొంటుండటం.. బడా కంపెనీలు భవిష్యత్తు తలుచుకొని ఆచితూచి ఖర్చు చేస్తుండటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని బిజినెస్ నిపుణులు అంటున్నారు. ఇక క్రికెట్ పట్ల అభిమానులకు ఉన్న ఆసక్తి కూడా తగినట్లు తెలుస్తోంది. అసలు చాలా మంది శ్రీలంకతో టీ20 సిరీస్‌ను లైట్ తీసుకున్నారు.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు లేకపోవడం ఓ కారణమైతే.. పూర్తిగా యువ ఆటగాళ్లతో కూడిన జట్టు కావడం.. బలహీనమైన ప్రత్యర్థి ఉండటంతో ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. మాములుగా భారత్ మ్యాచ్ జరిగితే హాట్ స్టార్‌లో కనీసం కోటీ మంది వీక్షించేవారు. కానీ నిన్నటి మ్యాచ్‌కు ఏ దశలోనూ అభిమానుల సంఖ్య 70 లక్షలు ధాటలేదు.

Story first published: Wednesday, January 4, 2023, 12:42 [IST]
Other articles published on Jan 4, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+