IND vs SL: శతక్కొట్టిన కోహ్లీ.. చెలరేగిన రోహిత్.. లంక ముందు భారీ లక్ష్యం!

గువహటి: శ్రీలంకతో తొలి వన్డేలో భారత బ్యాటర్లు దుమ్మురేపారు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(87 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 113) శతక్కొట్టగా.. రోహిత్ శర్మ(67 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 83), శుభ్‌మన్ గిల్(60 బంతుల్లో 11 ఫోర్లతో 70) హాఫ్ సెంచరీలతో రాణించారు. దాంతో శ్రీలంక ముందు టీమిండియా 374 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది.
రోహిత్-శుభ్‌మన్ గిల్ అద్భుత ఆరంభానికి విరాట్ కోహ్లీ సెంచరీ తోడవడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 373 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో కసున్ రజితా మూడు వికెట్లు తీయగా.. దిల్షాన్ మదుషంక, చమిక కరుణరత్నే, డసన్ షనక, ధనుంజయ డిసిల్వా తలో వికెట్ తీసారు.

అదిరిపోయే ఆరంభం..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ శుభారంభం అందించారు. ఆరంభం నుంచే శ్రీలంక బౌలర్లపై రోహిత్ ఎదురుదాడికి దిగగా.. శుభ్‌మన్ తనదైన శైలిలో పరుగులు రాబట్టాడు. దాంతో పవర్ ప్లేలో టీమిండియా వికెట్ నష్టపోకుండా 75 పరుగులు చేసింది.
ఆ తర్వాత కూడా అదే జోరు కనబర్చిన ఈ జోడీ స్కోర్ బోర్డును పరుగెత్తించింది. రోహిత్ శర్మ తన ట్రేడ్ మార్క్ పుల్ షాట్లతో విరుచుకుపడగా.. శుభ్‌మన్ తన క్లాస్ ఆటతో ఆకట్టుకున్నాడు.

రోహిత్ ఔటైనా..
క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని డసన్ షనక విడదీసాడు. శుభ్‌మన్ గిల్‌ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 143 పరుగులకు తెరపడింది. క్రీజులోకి వచ్చిన విరాట్‌తో రోహిత్ ధాటిగా ఆడాడు. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న హిట్‌మ్యన్‌ను మదుషంక క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ క్లాస్ షాట్లతో ఆకట్టుకున్నా.. ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. హసరంగా బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అనంతరం కేఎల్ రాహుల్‌తో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.

చెలరేగిన కోహ్లీ
రాహుల్ కూడా చూడచక్కని షాట్లతో అలరించడంతో భారత స్కోర్ బోర్డు పరుగెత్తింది. ధనుంజయ వేసిన 36వ ఓవర్‌లో ఓవర్ మిడ్ వికెట్ దిశగా సిక్స్‌బాదిన విరాట్ కోహ్లీ 46 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక కేఎల్ రాహుల్ కూడా ఆ దిశగా బ్యాటింగ్ చేసినా.. కాసున్ రజిత్ క్లీన్ బౌల్డ్ చేసి దెబ్బకొట్టాడు.
దాంతో నాలుగో వికెట్‌కు నమోదైన 90 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే హార్దిక్ పాండ్యా(14) కూడా ఔటవ్వగా.. అక్షర్ పటేల్ సాయంతో విరాట్ కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రజితా బౌలింగ్‌లో బౌండరీ, సింగిల్‌తో శతకాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ ఔటవ్వగా.. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో విరాట్ కోహ్లీ కూడా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన సిరాజ్‌తో కలిసి షమీ మరో వికెట్ పోకుండా ఇన్నింగ్స్ ముగించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications