IND vs SL: కుల్దీప్, సిరాజ్ తీన్మార్.. శ్రీలంక బేజార్! భారత్ ముందు లాలిపాప్ టార్గెట్!

కోల్‌కతా: శ్రీలంకతో రెండో వన్డేలో భారత బౌలర్లు దుమ్మురేపారు. మహమ్మద్ సిరాజ్(3/30), కుల్దీప్ యాదవ్ (3/51) తీన్మార్ వేయడంతో శ్రీలంక 39.4 ఓవర్లలో 215 పరుగులకు కుప్పకూలింది. దాంతో భారత్ ముందు 216 పరుగుల స్వల్ప లక్ష్యం నమోదైంది. అరంగేట్ర ప్లేయర్ నువనిందు ఫెర్నాండో(50) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లకు తోడుగా.. ఉమ్రాన్ మాలిక్ రెండు వికెట్లు తీసాడు. అక్షర్ పటేల్ ఓ వికెట్ పడగొట్టాడు.

సిరాజ్ సెన్సేషనల్ స్వింగర్..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. స్టన్నింగ్ ఇన్‌స్వింగర్‌తో ఓపెనర్ అవిష్కా ఫెర్నాండో(20)ను మహమ్మద్ సిరాజ్ పెవిలియన్ చేర్చాడు. పర్‌ఫెక్ట్ ప్లాన్‌తో సిరాజ్ బోల్తా కొట్టించాడు. క్రీజులోకి వచ్చిన కుశాల్ మెండిస్‌తో కలిసి అరంగేట్ర ఓపెనర్ నువనిందు ఫెర్నాండో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ జోడీ ఆచితూచి ఆడటంతో పవర్ ప్లేలో శ్రీలంక వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా చెలరేగిన ఈ జోడీ వీలుచిక్కిన బంతిని బౌండరీలకు తరలించింది.

మలుపు తిప్పిన శుభ్‌మన్..
క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని కుల్దీప్ యాదవ్ విడదీసాడు. హాఫ్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్న కుశాల్ మెండీస్‌ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 73 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన ధనంజయ డిసిల్వా(0)ను అక్షర్ పటేల్ సూపర్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో డిసిల్వా గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి చరిత్ అసలంక రాగా.. నవనిందు ఫెర్నాండో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక శుభ్‌మన్ గిల్ సూపర్ ఫీల్డింగ్‌తో ఫెర్నాండో రనౌటవ్వడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. కుల్దీప్ యాదవ్ వరుస ఓవర్లలో డసన్ షనక(2), చరిత్ అసలంక(15)లను ఔట్ చేశాడు.

చెలరేగిన కుల్దీప్..
ఫామ్‌లో ఉన్న షనకను క్లీన్ బౌల్డ్ చేసిన కుల్దీప్.. అసలంకను రిటర్న్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో 126 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి శ్రీలంక పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన హసరంగా బౌండరీలతో జోరు కనబర్చాడు. అయితే అతని జోరుకు ఉమ్రాన్ మాలిక్ చెక్‌పెట్టాడు. ఫాస్టెస్ట్ డెలివరీతో అతన్ని క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ కొద్ది సేపటికే కరుణరత్నే(17)ను కూడా అదే రీతిలో ఔట్ చేయగా.. బౌండరీలతో జోరు కనబర్చిన దునిత్ వెల్లలాగేకు సిరాజ్ చెక్ పెట్టాడు. క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చని సిరాజ్.. ఆ వెంటనే లాహిరు కుమారా(0)ను క్లీన్ బౌల్డ్ చేసి శ్రీలంక ఇన్నింగ్స్‌కు తెరదించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications