IND vs SL: శుభ్‌మన్ గిల్ కళ్లు చెదిరే క్యాచ్.. పోలా అదిరిపోలా! (వీడియో)
టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో మైమరిపించే ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. అతని అద్భుతమైన ఫీల్డింగ్‌తో కామిందు మెండీస్ పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
మూడో రోజు ఆటలో భాగంగా శ్రీలంక రెండో ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కుల్దీప్ యాదవ్ వేసిన ఈ ఓవర్ తొలి బంతిని కామిందు మెండీస్ డ్రైవ్ షాట్ ఆడగా.. షార్ట్ ఎక్స్‌ట్రా కవర్స్‌లో శుభ్‌మన్ గిల్ అద్భుతంగా డైవ్ చేసి సింగిల్ హ్యాండ్‌తో బంతిని అందుకున్నాడు. ముందుకు స్ట్రెచ్ చేసి మరి ఈ క్యాచ్ పట్టాడు.

ఈ స్టన్నింగ్ క్యాచ్‌కు భారత ఆటగాళ్లతో పాటు అంపైర్లు, బ్యాటర్లు అవాక్కయ్యారు. కామిందు మెండీస్(14) నిరాశగా పెవిలియన్ చేరాడు. శుభ్‌మన్ గిల్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. శుభ్‌మన్ గిల్ క్యాచ్.. పోలా అదిరిపోలా అని కామెంట్ చేస్తున్నారు.
నిప్పులు చెరిగిన బౌలర్లు..
భారత బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. మహమ్మద్ సిరాజ్, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా నిప్పులు చెరగడంతో తొలి సెషన్‌లో 28 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయారు. దాంతో శ్రీలంక 99/5 స్కోర్ వద్ద లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. సిరాజ్ ధాటికి నిషాన్ మదుషంక(0) డకౌట్ కాగా.. లాహిరు(27), దినేష్ చండిమల్(4)ను మానవ్ సుతార్ పెవిలియన్ చేర్చాడు.
కామిందు మెండీస్‌ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేయగా.. కెప్టెన్ ధనంజయ డిసిల్వా(21)ను జడేజా పెవిలియన్ చేర్చాడు. క్రీజులో సోనాల్ దినుషా(24 బ్యాటింగ్), నిరోషన్ డిక్‌వెల్లా(18 బ్యాటింగ్) ఉన్నారు.
భారత్ 462 ఆలౌట్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌటైంది. దేవదత్ పడిక్కల్(230 బంతుల్లో 15 ఫోర్లు, సిక్స్‌తో 167) సెంచరీతో రాణించగా.. కేఎల్ రాహుల్(175 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 82) శతకాన్ని చేజార్చుకున్నాడు. ధ్రువ్ జురెల్(68 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య(4/109) నాలుగు వికెట్లు తీయగా.. కేశర నువాంత(3/175) మూడు వికెట్లు పడగొట్టాడు. అసితా ఫెర్నాండో(2/63) రెండు వికెట్లు తీసాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
