Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: శుభ్‌మన్ గిల్ సూపర్ ఫీల్డింగ్.. రనౌట్‌తో మలుపు తిప్పిన లోకల్ బాయ్!

 IND vs SL: Shubman Gill Displays Fielding Prowess to dismiss Nuwanidu Fernando

కోల్‌కతా: శ్రీలంకతో రెండో వన్డేలో టీమిండియా యువ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ సూపర్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. సూపర్ రనౌట్‌తో మ్యాచ్‌ను పూర్తిగా మలుపు తిప్పాడు. శుభ్‌మన్ గిల్ అసాధారణ ఫీల్డింగ్‌తో క్రీజులో సెట్ అయిన నువనిందు ఫెర్నాండో(50) రనౌట్‌గా వెనుదిరిగాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న నువనిందు ఫెర్నాండో.. శ్రీలంకకు మంచి ఆరంభాన్ని అందించాడు.

అక్షర్ పటేల్ వేసిన 22వ ఓవర్ తొలి బంతిని ఫెర్నాండో ఫ్లిక్ షాట్ ఆడాడు. దాంతో ఆ బంతికాస్త మిడ్ వికెట్ దిశగా గాల్లోకి లేచింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న శుభ్‌మన్ గిల్ పుల్ లెంగ్త్ డైవ్‌తో క్యాచ్ కోసం ప్రయత్నించాడు. కానీ బంతిని అందుకోలేకపోయాడు. అయినా అలర్ట్‌గా ఉన్న శుభ్‌మన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా బంతిని వికెట్ కీపర్ రాహుల్‌కు అందజేసాడు.

బంతిని అందుకున్న రాహుల్ వికెట్లను గిరాటేయడంతో ఫెర్నాండో పెవిలియన్ చేరాడు. నాన్ స్ట్రైకర్‌తో సమన్వయం సరిగ్గా లేకపోవడంతో ఫెర్నాండో మూల్యం చెల్లించుకున్నాడు. శుభ్‌మన్ గిల్‌కు కోల్‌కతా హోమ్ గ్రౌండ్ కాగా.. అతని పేరేంట్స్ ఈ మ్యాచ్‌కు హాజరై ప్రత్యక్షంగా చూస్తున్నారు. క్రీజులో సెట్ అయిన యువ ప్లేయర్ ఫెర్నాండోను శుభ్‌మన్ గిల్ రనౌట్ చేయడంతో శ్రీలంక ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.

కుల్దీప్ యాదవ్ వరుస ఓవర్లలో డసన్ షనక(2), చరిత్ అసలంక(15)లను ఔట్ చేశాడు. ఫామ్‌లో ఉన్న షనకను క్లీన్ బౌల్డ్ చేసిన కుల్దీప్.. అసలంకను రిటర్న్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో 126 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి శ్రీలంక పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత బౌండరీలతో జోరు కనబర్చిన హసరంగాను ఉమ్రాన్ మాలిక్ చెక్‌పెట్టాడు. 34 పరుగుల వ్యవధిలోనే శ్రీలంక మూడు వికెట్లు కోల్పోయింది. క్రీజులో చమిక కరుణరత్నే, దునిత్ వెల్లలాగే ఉన్నారు.

ఈ మ్యాచ్‌కు టీమిండియా ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగింది. యుజ్వేంద్ర చాహల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చాడు. తొలి వన్డేలో డైవ్ చేసినప్పుడు చాహల్‌కు గాయమైందని, దాంతో అతన్ని పక్కనపెట్టాల్సి వచ్చిందని టాస్ సందర్భంగా రోహిత్ శర్మ స్పష్టం చేశాడు.

Story first published: Thursday, January 12, 2023, 15:54 [IST]
Other articles published on Jan 12, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+