
నాలుగో భారత బ్యాట్స్‌మన్‌గా..
దాంతో సెంచరీ ముంగిట స్టంపౌటైన నాలుగో భారత బ్యాట్స్‌మన్‌గా శ్రేయస్ అయ్యర్ గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో భారత దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, దిలీప్ వెంగ్ సర్కార్‌ల సరసన నిలిచాడు. భారత ఇన్నింగ్స్ 60వ ఓవర్ వేసిన లంక స్పిన్నర్ ప్రవీణ్ జయవిక్రమ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ స్టెప్ ఔటై భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ అయ్యర్ క్రీజు వదిలి ముందుకు రావడాన్ని ముందే పసిగట్టిన జయవిక్రమ లెగ్ స్టంప్‌కు వెలుపలగా బంతిని విసిరి టర్న్ చేశాడు. దాంతో ఆ బంతిని ఆడలేకపోయిన అయ్యర్.. స్టంపౌట్‌గా వెనుదిరిగాడు.

సచిన్ 90.. సెహ్వాగ్ 99.. శ్రేయస్ 92
1987లో పాకిస్థాన్‌తో చెన్నై వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో దిలీప్ వెంగ్‌సర్కార్ 96 పరుగుల వద్ద స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత 2001లో బెంగళూరు వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో సచిన్ టెండూల్కర్ 90 పరుగుల వద్ద స్టంపౌట్ అయ్యాడు. అనంతరం 2010లో శ్రీలంకతో కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్ వీరేంద్ర సెహ్వాగ్ 99 పరుగుల వద్ద స్టంపౌటయ్యాడు. తాజాగా శ్రేయాస్ అయ్యర్ ఆ జాబితాలో చేరాడు.

డే వన్.. 16 వికెట్లు..
సొంతగడ్డపై ఇంతకుముందు ఆడిన రెండు డే/నైట్ టెస్ట్‌లను వరుసగా 3, 2 రోజుల్లోనే ప్రత్యర్థులను చుట్టేసిన భారత్.. మూడో మ్యాచ్‌లోనూ అదే ఒరవడిని కొనసాగించేలా ఉంది. బ్యాటింగ్ చాలా కష్టంగా మారిన పరిస్థితుల్లో తొలి రోజు బ్యాట్‌తో, బంతితో సత్తా చాటింది. శ్రేయస్ అయ్యర్ (98 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 92) మేటి ఇన్నింగ్స్ ఆడటంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 252 పరుగులు చేసింది.
లంక బౌలర్లలో ఎంబుల్దేనియా (3/94), జయవిక్రమ (3/81), ధనంజయ డిసిల్వా (2/32) రాణించారు. అనంతరం జస్‌ప్రీత్ బుమ్రా (3/15), మహ్మద్ షమీ (2/18)ల ధాటికి లంక 86/6తో నిలిచింది. మాథ్యూస్ (85 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43) చెప్పుకోదగ్గ ఒక్కడే ఇన్నింగ్స్ ఆడాడు. ఆట ఆఖరుకు డిక్వెలా (13), ఎంబుల్దేనియా (0) క్రీజులో ఉన్నారు.


Click it and Unblock the Notifications
