IND vs SL: మలుపు తిప్పిన ఉమ్రాన్ మాలిక్.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన భారత్!

ముంబై: కొత్త ఏడాదిని టీమిండియా విజయంతో ప్రారంభించింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 2 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. అరంగేట్ర పేసర్ శివమ్ మావి (4/22), జమ్మూ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్(2/27) భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసింది. దీపక్ హుడా(23 బంతుల్లో ఫోర్, 4 సిక్సర్లతో 41 నాటౌట్), అక్షర్ పటేల్(20 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 31 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగగా.. హార్దిక్ పాండ్యా(29), ఇషాన్ కిషన్ పర్వాలేదనపించారు. లంక బౌలర్లలో దిల్షాన్, మహీశ్ తీక్షణ, చమిక కరుణరత్నే, ధనుంజ డిసిల్వా, వానిందు హసరంగా ఐదు వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 160 పరుగులకు కుప్పకూలింది. డసన్ షనక(27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 45), చమిక కరుణరత్నే(16 బంతుల్లో 2 సిక్సర్లతో 23 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో శివమ్ మావి నాలుగు వికెట్లు తీయగా.. ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు తీసారు.

చెలరేగిన శివమ్ మావి..
163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. ఓపెనర్ పాతుమ్ నిస్సంక(1)ను అరంగేట్ర పేసర్ శివమ్ మావి స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. తన మరుసటి ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన ధనుంజ డిసిల్వా(8)ను క్యాచ్ ఔట్‌గా బోల్తా కొట్టించాడు. కుశాల్ మెండీస్(28) బౌండరీలు బాదడంతో శ్రీలంక పవర్ ప్లేలో 2 వికెట్లకు 35 పరుగులు చేసింది. పవర్ ప్లే అనంతరం చరిత్ అసలంక(12)ను ఉమ్రాన్ మాలిక్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చగా.. మరుసటి ఓవర్‌లో హర్షల్ పటేల్ జోరు మీదున్న కుశాల్ మెండీస్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. క్రీజులోకి వచ్చిన భానుక రాజపక్సను హర్షల్ పటేల్ ఔట్ చేయడంతో 68 పరుగులకే లంక 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

మ్యాచ్ టర్నింగ్ పాయింట్..
ఈ పరిస్థితుల్లో వానిందు హసరంగా(21)తో కలిసి కెప్టెన్ డసన్ షనక(45) జట్టును ఆదుకున్నారు. క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని శివమ్ మావి విడదీసాడు. వానిందు హసరంగా(21)ను ఔట్ చేసి 40 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. ఆ వెంటనే డసన్ షనకను ఫాస్టెస్ట్ డెలవరీతో ఉమ్రాన్ మాలిక్‌ను బోల్తా కొట్టించాడు. దాంతో మ్యాచ్‌పై భారత్ పట్టు బిగించింది. డసన్ షనక వికెట్ తీసి ఉమ్రాన్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.

అక్షర్ పటేల్‌తో ప్రయోగం..
ఆ తర్వాత మహీశ్ తీక్షణ(1)ను శివమ్ మావి ఔట్ చేయగా.. చమిక కరుణరత్నే(14) సిక్సర్‌తో మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చాడు. లంక విజయానికి చివరి ఓవర్‌లో 13 పరుగులు అవసరమవ్వగా.. హార్దిక్ ఆఖరి ఓవర్‌ను అక్షర్ పటేల్‌కు ఇచ్చాడు. అయితే అక్షర్ వేసిన మూడో బంతిని కరుణరత్నే సిక్సర్ బాదాడు. దాంతో భారత శిభిరంలో కంగారు మొదలైంది. కానీ చివరి మూడు బంతులను కట్టడిగా వేసిన అక్షర్ పటేల్.. విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications