IND vs SL: గాయంతో సాయి సుదర్శన్ ఔట్.. రేసులో తెలుగోడు!
శ్రీలంక పర్యటనలో ఉన్న టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే జస్‌ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి గాయాలతో ఈ పర్యటనకు దూరం కాగా.. జాగా ఈ జాబితాలో సాయి సుదర్శన్ చేరాడు. కాలి బొటన వేలి గాయంతో ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.
భారత్-ఏ తరఫున శ్రీలంక-ఏతో జరిగిన సిరీస్‌లో సాయి సుదర్శన్ కాలి వేలికి గాయమైంది. అయినా శ్రీలకంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌కు సాయి సుదర్శన్‌ను ఎంపిక చేసిన సెలెక్టర్లు.. ఫిట్‌నెస్ నిరూపించుకుంటే సిరీస్‌లో కొనసాగుతాడని తెలిపారు. అయితే తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో సాయి సుదర్శన్ గాయం తగ్గలేదని తేలింది. దాంతో అతను ఈ సిరీస్ మొత్తానికి దూరం కావాల్సి వచ్చింది. అయితే సాయి సుదర్శన్ దూరమవ్వడంపై బీసీసీఐ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఆ సమయంలోనే అతనికి రిప్లేస్‌మెంట్‌గా మరో ఆటగాడిని ఎంపిక చేయవచ్చు.

రేసులో తెలుగోడు..
సాయి సుదర్శన్ స్థానంలో తెలుగు తేజం షేక్ రషీద్‌ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన షేక్ రషీద్‌కు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మెరుగైన రికార్డ్ ఉంది. ముఖ్యంగా టాపార్డర్ బ్యాటర్‌గా అతని రికార్డ్స్ మెరుగ్గా ఉన్నాయి. ఇప్పటి వరకు 29 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన షేక్ రషీద్ 46.64 సగటుతో 1959 పరుగులు చేశాడు. ఇందులో 5 శతకాలతో పాటు 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇటీవల శ్రీలంక-ఏ జరిగిన అనధికారిక టెస్ట్ సిరీస్‌లోనూ షేక్ రషీద్ మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో 63, 20, 45 పరుగులతో రాణించాడు. అయితే షేక్ రషీద్‌కు సర్ఫరాజ్ ఖాన్‌తో పోటీ నెలకొంది. అయితే ఐపీఎల్ తర్వాత సర్ఫరాజ్ ఖాన్ ఎలాంటి ప్రొఫెషనల్ క్రికెట్ ఆడలేదు.
సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తే సర్ఫరాజ్ ఖాన్‌కు అవకాశం లభిస్తుంది. సెలెక్టర్లు సర్ఫరాజ్ ఖాన్‌తో పాటు షేక్ రషీద్ పేర్లను సాయి సుదర్శన్‌కు రిప్లేస్‌మెంట్‌గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రుతురాజ్ గైక్వాడ్ కూడా రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

