IND vs SL: షెఫాలీ వర్మ ఊచకోత.. శ్రీలంకపై భారత్ ఘన విజయం
టీ20 ఫార్మాట్‌లోనూ భారత మహిళల జట్టు జోరు కొనసాగుతోంది. శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా మరో రెండు మ్యాచ్‌లు ఉండగానే కైవసం చేసుకుంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. శుక్రవారం తిరువనంతపురం వేదికగా జరిగిన మూడో టీ20లో సమష్టిగా రాణించిన భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బౌలింగ్‌లో రేణుక సింగ్, దీప్తి శర్మ నిప్పులు చెరిగితే.. బ్యాటింగ్‌లో షెఫాలీ వర్మ(42 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 79 నాటౌట్) మరో అజేయ హాఫ్ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక మహిళల టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 112 పరుగులే చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో హాసిని పెరెరా(25), ఇమెషా దులని(27), కవిషా దిల్‌హరి(20) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్(4/21) నాలుగు వికెట్లు తీయగా.. స్పిన్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ(3/18) మూడు వికెట్లు పడగొట్టింది.

అనంతరం భారత్ 13.2 ఓవర్లలో 2 వికెట్లకు 115 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. షెఫాలీ వర్మ అజేయ హాఫ్ సెంచరీకి తోడుగా కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్(18 బంతుల్లో 2 ఫోర్లతో 21 నాటౌట్) రాణించింది. స్మృతి మంధాన(1) వరుసగా మూడో మ్యాచ్‌లోనూ విఫలమవ్వగా.. జెమీమా రోడ్రిగ్స్(9) తీవ్రంగా నిరాశపర్చింది. శ్రీలంక బౌలర్లలో కవిషా దిల్‌హరి(2/18) రెండు వికెట్లు పడగొట్టారు.
నిరాశపర్చిన స్మృతి..
స్వల్ప లక్ష్యఛేదనలో భారత మహిళలకుఆశించిన శుభారంభం దక్కలేదు. పెళ్లి రద్దుతో మానసికంగా డిస్టర్బ్ అయిన స్మృతి మంధాన వరుసగా మూడో మ్యాచ్‌లోనూ విఫలమైంది. దిల్‌హరి బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగింది. స్మృతి ఔటైనా షెఫాలీ వర్మ తనదైన శైలిలో చెలరేగింది. దాంతో పవర్ ప్లేలో భారత్ వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. పవర్ ప్లే ముగిసిన వెంటనే షెఫాలీ వర్మ 24 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. ఆచితూచి ఆడిన జెమీమా(9)ను దిల్‌హరి క్లీన్ బౌల్డ్ చేసింది.
దాంతో రెండో వికెట్‌కు నమోదైన 47 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సాయంతో షెఫాలీ వర్మ భారత విజయలాంఛనాన్ని పూర్తి చేసింది. సంచలన బౌలింగ్ ప్రదర్శనతో భారత విజయానికి బాటలు వేసిన రేణుక సింగ్(4/21) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. వరుసగా మూడు మ్యాచ్‌లు ఏకపక్షంగా ముగియడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. నాలుగో టీ20 తిరువనంతపురం వేదికగానే ఆదివారం జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications