టీమిండియా ఆరో బౌలింగ్ ఆప్షన్‌గా కెప్టెన్ రోహిత్ శర్మను పరిగణించడం సరికాదని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్కాట్ స్టైరీస్ అన్నాడు. ఎక్స్‌ట్రా బౌలింగ్ ఆప్షన్స్‌గా పార్ట్‌టైమ్ బౌలర్ల కంటే ఆల్‌రౌండర్లను ప్రయత్నించాలని టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు స్కాట్ స్టైరీస్ సూచించాడు.
శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. వన్డే సిరీస్‌లో మాత్రం తడబడుతోంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయాన్ని అందుకోలేకపోయింది. సునాయసంగా గెలవాల్సిన తొలి మ్యాచ్‌ను తృటిలో చేజార్చుకున్న టీమిండియా.. రెండో వన్డేలో 32 పరుగుల తేడాతో చిత్తయ్యింది.

11 ఏళ్ల తర్వాత శ్రీలంక చేతిలో ఓ వన్డే మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ పర్యటనతోనే టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గంభీర్.. ఎక్స్‌ట్రా బౌలింగ్ ఆప్షన్స్‌పై ఫోకస్ పెట్టాడు.
టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, రియాన్ పరాగ్‌లను ఉపయోగించుకొని ఆశించిన ఫలితాన్ని రాబట్టాడు. కానీ వన్డే సిరీస్‌లో శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మలను ప్రయోగించగా.. ఫలితం రాలేదు. తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ దారుణంగా విఫలమవ్వగా.. రెండో వన్డేలో రోహిత్ బౌలింగ్‌లో ప్రభావం చూపలేకపోయాడు.

ఈ క్రమంలోనే ఈ సిరీస్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న స్కాట్ స్టైరీస్.. గంభీర్‌కు కీలక సూచన చేశాడు. 'రెండో వన్డేలో రోహిత్ శర్మ బౌలింగ్ చేశాడు. కానీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. భారత్ తమ ఆరో బౌలింగ్ ఆప్షన్ కోసం ఇతరులను ప్రయత్నించాలి.'అని స్కాట్ స్టైరీస్ సూచించాడు.
ఇరు జట్ల మధ్య మూడో వన్డే బుధవారం కొలంబో వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ భారత్‌కు డూ ఆర్ డై.. గెలిస్తే సిరీస్ సమం అవుతోంది. లేదంటే శ్రీలంక కైవసం చేసుకుంటుంది.