IND vs SL తొలి టెస్ట్.. లైవ్‌లో తిట్టుకున్న సంజయ్ మంజ్రేకర్, మురళీ కార్తీక్!
భారత్, శ్రీలంక తొలి టెస్ట్ మ్యాచ్ సందర్భంగా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్, మురళీ కార్తీక్‌ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌కు కామెంటేటర్లుగా వ్యవహరిస్తున్న ఈ ఇద్దరూ లైవ్‌లోనే తిట్టుకున్నారు. సరదాగా మొదలైన ఈ వాగ్వాదం మాట మాట పెరిగి వివాదాస్పదంగా మారింది.
మ్యాచ్ మూడో రోజు లంచ్ బ్రేక్ సమయంలో స్టూడియోలో ఉన్న మురళీ కార్తీక్, గ్రౌండ్‌లో కామెంట్రీ ఇస్తున్న సంజయ్ మంజ్రేకర్ ముఖ కవళికలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీసాయి.
అద్దంలో చూసుకో..
మంజ్రేకర్ ముఖకవలికలను మురళీ కార్తీక్ ఎద్దేవా చేశాడు. 'ఈ శతాబ్దంలోనే అత్యుత్తమైన బుంగమూతి ముఖం నీదే. కానీ నీ ముఖ కవలికలతో నువ్వు ఏం చెబుతున్నావో మాకు అర్థం కావడం లేదు. దయచేసి ఆ హవభావాలను కాస్త తగ్గించు'అని అన్నాడు. మంజ్రేకర్ వెంటనే.. 'ఈ మాటలు సరైనవి కాదు. కెమెరా యాంగిల్ మార్చి.. వెంటనే కెమెరాను స్ప్లిట్ స్క్రీన్‌గా మార్చి.. అజింక్య రహానే వైపు తిప్పండి. ఎందుకంటే అతడు మాట్లాడేందుకు చాలా ప్రశాంతంగా ఉంటాడు.

పైగా అతడి ముఖం కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ సమయంలో మురళీ కార్తీక్ అద్దంలో తన ముఖం చూసుకోని మురిసిపోతాడు.'అని సంజయమంజ్రేకర్ కౌంటరిచ్చాడు. ఆ వెంటనే మురళీ కార్తిక్ బదులిస్తూ.. 'నేను అద్దంలో చూసుకోను. అలా మీరే చేస్తారు. మీతో కలిసి పనిచేసిన వారికి ఈ విషయం బాగా తెలుసు. 'అని అన్నాడు.
రచ్చ చేస్తారు..
మరింత ఆగ్రహానికి గురైన సంజయ్ మంజ్రేకర్..'నేను అద్దంలో చూసుకోవడానికి ఒక కారణం ఉంది. కానీ మీలాంటి వారికి అద్దం ముందు నిలబడటానికి ప్రేరణ ఉండదని నేను అర్థం చేసుకోగలను. కానీ మనమిద్దరం చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాం. సోషల్ మీడియాలో దీనిపై విపరీతంగా ట్రోల్స్ వస్తాయి, ఫ్యాన్స్‌కు పండగే'అని నవ్వుతూ ముగించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం ముంగిట నిలిచింది. టీమిండియా విజయానికి 6 వికెట్లు కావాల్సి ఉండగా.. శ్రీలంక 288 పరుగులు చేయాలి.
సంక్షిప్త స్కోర్లు..
భారత్ తొలి ఇన్నింగ్స్ 462 ఆలౌట్ (దేవదత్ పడిక్కల్ 167, కేఎల్ రాహుల్ 82, ప్రబాత్ జయసూర్య 4/109)
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 284 ఆలౌట్( సొనాల్ దినుషా 100, నిరోషణ్ డిక్‌వెల్లా 80)
భారత్ రెండో ఇన్నింగ్స్ 193 ఆలౌట్(రిషభ్ పంత్ 66, దేవదత్ పడిక్కల్ 44)
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ 84/4 (ధనంజయ డిసిల్వా 31 బ్యాటింగ్, సోనాల్ దినుషా 25 బ్యాటింగ్)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
