IND vs SL: విరాట్ కోహ్లీ సెంచరీ మిస్.. వైరల్‌గా రోహిత్ రియాక్షన్! (వీడియో)

మొహాలి: ఎన్నో అంచనాల మధ్య కెరీర్ 100వ టెస్ట్‌లో బరిలోకి దిగిన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశపరిచాడు. శ్రీలంకతో మొహాలీ వేదికగా జరుగుతున్న ఫస్ట్ టెస్ట్‌కు విరాట్‌కు 100వ మ్యాచ్ కావడంతో.. సెంచరీతో చెలరేగుతాడని అంతా భావించారు. కోహ్లీ సైతం తనదైన కవర్ డ్రైవ్స్‌తో అలరిస్తూ సెంచరీ చేసేలా కనిపించాడు. సూపర్ బ్యాటింగ్‌తో క్రీజులో పాతుకుపోయాడు. కానీ హాఫ్ సెంచరీ చేరువగా వచ్చిన విరాట్ కోహ్లీ(76 బంతుల్లో 5 ఫోర్లు 45)ని శ్రీలంక స్పిన్నర్ లసిత్ ఎంబుల్దెనియా క్లీన్ బౌల్డ్ చేశాడు. సూపర్బ్ బాల్‌తో బోల్తా కొట్టించాడు.
ట్రాప్‌లో పడ్డ కోహ్లీ..
ఎంబుల్దెనియా వేసిన ఫుల్లర్ లెంగ్త్ బాల్‌ను అంచనా వేయడంలో విఫలమైన కోహ్లీ దానికి మూల్యం చెల్లించుకున్నాడు. లసిత్ ఎంబుల్దెనియా ఒకే తరహా ఫుల్లర్ లెంగ్త్ బాల్స్‌తో కోహ్లీని ట్రాప్‌లో పడేసాడు. ఔటవ్వడానికి ముందు కూడా అచ్చం ఇలాంటి బాల్ వేయగా కోహ్లీ ఫ్రంట్‌ఫుట్‌లో ఆడుతూ డిఫెన్స్ చేశాడు. ఆ తర్వాత అదే తరహా బంతిని కాస్త వేగంగా వేయగా.. బ్యాక్ ఫుట్‌లో ఆడే ప్రయత్నం చేసిన కోహ్లీ లైన్ మిస్సయ్యాడు. దాంతో బంతి స్పిన్ అవుతూ వికెట్లను గీరాటేసింది. ఇక కోహ్లీ సైతం ఈ బాల్‌కు బిత్తరపోయాడు. బంతి అలా ఎలా టర్న్ అయిందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు.

రోహిత్ డిస్సప్పాయింట్..
దాంతో అప్పటివరకు విరాట్ కోహ్లీ ఆటను ఎంతో ఆసక్తిగా చూసిన రోహిత్ శర్మ ఈ ఊహించని పరిణామంతో షాక్‌కు గురయ్యాడు. 'అబ్బా చా..'అని అరుస్తూ చేతులను తల వెనుకాల పెట్టుకున్నాడు. కోహ్లీ ఔటవ్వడం పట్ల తీవ్ర బాధకు గురయ్యాడు. అతని హావభావాలు టీవీ కెమెరాల్లో కనిపించాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కీలక ఇన్నింగ్స్..
అయితే సెంచరీ చేయకపోయినా విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్సే ఆడాడు. హనుమ విహారితో కలిసి మూడో వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దాంతో ఆరంభంలోనే ఓపెనర్లు రోహిత్ శర్మ(29), మయాంక్ అగర్వాల్(33) వికెట్లు కోల్పోయినా.. టీమిండియా భారీ స్కోర్ దిశగా కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో 32 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ టెస్టుల్లో 8వేల పరుగులు మైలురాయిని అందుకున్నాడు. తద్వారా టీమిండియా తరపున టెస్టుల్లో 8వేల పరుగుల మార్క్‌ను అందుకున్న 6వ ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు.
రఫ్ఫాడిస్తున్న పంత్..
తెలుగు క్రికెటర్ హనుమ విహారీ(58) హాఫ్ సెంచరీ చేసి ఔటవ్వగా.. క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్‌తో రిషభ్ పంత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. కానీ శ్రేయస్ అయ్యర్(27) డిసిల్వా బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన జడేజాతో కలిసి పంత్ ధాటిగా ఆడుతున్నాడు. ఆరంభంలో కొంత సమయం తీసుకున్నా.. తర్వాత తనదైన శైలిలో చెలరేగుతున్నాడు. ఇప్పటికే నాలుగు భారీ సిక్స్‌లు బాదిన సెంచరీకి చేరవయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications