
కోహ్లీ డకౌట్..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. థర్డ్ అంపైర్ తప్పిదంతో ఓపెనర్ కేఎల్ రాహుల్(6) ఎల్బీగా వెనుదిరిగాడు. మహీశ్ తీక్షణ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో రాహుల్ ఔటవ్వగా.. దిల్షాన్ మదుషంక వేసిన మరుసటి ఓవర్‌లో విరాట్ కోహ్లీ(0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో భారత్ 13 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్‌తో కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డు పరుగెత్తించాడు. దాంతో పవర్ ప్లేలో టీమిండియా 2 వికెట్లకు 44 పరుగులు చేసింది.

ఆదుకున్న రోహిత్..
ఓవైపు సూర్య నిదానంగా ఆడినా మరోవైపు రోహిత్ వీలుచిక్కిన బంతులను బౌండరీలకు తరలించాడు. ఇక అషిత వేసిన 10వ ఓవర్‌లో ఓసిక్స్, బౌండరీ బాదిన రోహిత్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక సూర్య సైతం గేమ్ మార్చడంతో భారత స్కోర్ బోర్డు పరుగెత్తింది. అయితే కరుణరత్నే ఊరించే షార్ట్ పిచ్ బాల్‌తో రోహిత్‌ను బోల్తా కొట్టించాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 97 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ కొద్ది సేపటికే ధాటిగా ఆడే క్రమంలో సూర్య సైతం వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన పంత్ రెండు బౌండరీలతో జోరు కనబర్చాడు.

అశ్విన్ సిక్సర్‌తో...
సిక్సర్‌తో దూకుడు కనబర్చిన హార్దిక్ పాండ్యా క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత దీపక్ హుడా(3) సైతం ఔటైనా.. నోబాల్‌తో బచాయించాడు. కానీ ఈ అవకాశాన్ని అందుకోలేకపోయాడు. దిల్షాన్ మదుశంక వేసిన 19వ ఓవర్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత పంత్ కూడా ఔటవ్వడంతో టీమిండియా భారీ స్కోర్‌కు బ్రేక్ పడింది. స్లో ఓవర్ రేట్‌తో చివరి రెండు ఓవర్లను శ్రీలంక సర్కిల్ బయట నలుగురి ఫీల్డర్లతోనే బౌలింగ్ చేసినా.. భారత బ్యాటర్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు. కానీ అశ్విన్(15 నాటౌట్) భారీ సిక్సర్‌తో జట్టు స్కోర్‌ను 170 పరుగుల మార్క్‌ను ధాటించాడు.


Click it and Unblock the Notifications
