మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక తెలిపాడు. ఈ వికెట్ కూడా తొలి వన్డే తరహాలోనే ఉండనుందని అభిప్రాయపడ్డాడు.
'మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. ఈ మ్యాచ్ కూడా మరో రోజులానే. కెప్టెన్‌గా నాకు ఈ మ్యాచ్ ఏమాత్రం భిన్నం కాదు. జట్టుకు దూరమైన హసరంగా, షిరాజ్ స్తానంలో కామిందు, వండర్సే జట్టులోకి వచ్చారు.'అని చరిత్ అసలంక చెప్పుకొచ్చాడు.

మరోవైపు ఛేజింగ్ చేయడం తమకు అనుకూలమేనని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. టీమ్ కాంబినేషన్‌ను మార్చాలనే ఆలోచన లేకపోవడంతోనే బెంచ్ ఆటగాళ్లను తీసుకోలేదన్నాడు. 'మేం ఛేజింగ్ చేసేటప్పుడు ఏం అంచనా వేస్తారో మాకు బాగా తెలుసు. ప్రతీసారి ఒకే మైండ్‌సెట్‌తో ఒకే విధంగా ఆడటం కుదురదు.
కండిషన్స్‌ను అందిపుచ్చుకుంటే స్వేచ్చగా ఆడవచ్చు. నిర్భయంగా.. స్వేచ్చగా ఆడటానికే మేం అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. అందుకే తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. గత మ్యాచ్‌లో గెలవనందుకు మేం ఏం బాధపడటం లేదు. ఇరు జట్లు అద్భుతంగా ఆడాయి. ఫలితం మాత్రం ఎవరికీ అనుకూలంగా రాలేదు.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
తుది జట్లు:
పాతుమ్ నిస్సంక, అవిష్కా ఫెర్నాండో, కుశాల్ మెండీస్, సదీర విక్రమా, చరిత అసలంక, కామిందు మెండీస్, జోనిత్ లియాంగే, దునిత్ లెల్లలాలే, అకిల ధనంజయ, అసితా ఫెర్నాండో, జెఫ్రీ వండర్సే.
భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.