IND vs SL: కొత్త సంప్రదాయానికి తెరదీసిన రోహిత్ శర్మ.. ట్రోఫీ అందించిన ఆ వ్యక్తి ఎవరంటే?

ధర్మశాల: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త సంప్రదాయానికి తెరదీశాడు. శ్రీలంకతో ఆదివారం జరిగిన ఆఖరి టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. దాంతో రోహిత్ సేన 3-0తో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. విజయానంతరం కెప్టెన్‌గా ట్రోఫీని అందుకున్న రోహిత్ శర్మ.. దాన్ని సంప్రదాయానికి విరుద్దంగా ఓ బీసీసీఐ అధికారికి అందించాడు. దాంతో టీవీల ముందున్న ప్రేక్షకులు, అతని అభిమానులు ఆశ్చర్యపోయారు. సంప్రదాయం ప్రకారం ట్రోఫీని జట్టులోకి వచ్చిన యువ ఆటగాళ్లకు ఇవ్వడం ఆనవాయితీ.
సంప్రదాయానికి విరుద్దంగా..
మాజీ కెప్టెన్లు మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ కూడా ఈ సంప్రదాయాన్ని గౌరవించారు. రోహిత్ శర్మ కూడా ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన సిరీస్‌లో అదే సంప్రదాయాన్ని గౌరవిస్తూ రవి బిష్ణోయ్ చేతికి ట్రోఫీని అందించాడు. కానీ శ్రీలంకపై టైటిల్ గెలిచిన తర్వాత దాన్ని నేరుగా తీసుకెళ్లి బీసీసీఐ రిప్రజెంటేటివ్ అయిన జయదేవ్ షాకు అందజేశాడు. దాంతో ఎవరీ జయదేవ్ షా అని నెటిజన్లు ఒకటే సెర్చ్ చేస్తున్నారు.

జయదేవ్ షా ఎవరంటే?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి సుదీర్ఘకాలం సెక్రటరీగా పనిచేసిన నిరంజన్ షా కొడుకే ఈ జయదేవ్ షా. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఆడిన జయదేవ్ షా 5,354 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న సిరీస్‌కు బోర్డు అఫిషియల్‌గా వ్యవహరిస్తున్నాడు. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన జయదేవ్ షా.. బోర్డు ఆదేశాల మేరకు బోర్డు రిప్రజెంటేటివ్‌గా జట్టుతోనే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మ నేరుగా ట్రోఫీని తీసుకొచ్చి తన చేతికివ్వడంతో తొలుత ఆశ్చర్యపోయిన జయదేవ్ షా.. ఆ తర్వాత రోహిత్ శర్మ రిక్వెస్ట్ మేరకు జట్టుతో కలిసి ఫొటోలు దిగాడు.

చెలరేగిన శ్రేయస్ అయ్యర్
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 146 పరుగులు చేసింది. కెప్టెన్ షనక (38 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 74 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. అవేశ్ ఖాన్ (2/23), మహమ్మద్ సిరాజ్ (1/22), హర్షల్ పటేల్ (1/29)లు సత్తా చాటారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 16.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటిన శ్రేయస్ అయ్యర్ (45 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 73 నాటౌట్) కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' అవార్డులు లభించాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications