For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SL పింక్ బాల్ సమరం.. అందరి కళ్లు కోహ్లీ, రోహిత్ పైనే! మూడేళ్ల నిరీక్షణకు తెరపడేనా?

 IND vs SL: Rohit Sharma and Virat Kohli in a duel for pink-ball Test batting supremacy

బెంగళూరు: వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. శ్రీలంకతో బెంగళూరు వేదికగా శనివారం నుంచి ప్రారంభం కానున్న డై/నైట్ టెస్ట్‌లో రోహిత్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు మాజీ సారథి విరాట్‌ కోహ్లీ ఎలా ఆడతారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటివరకు భారత్‌ ఆడిన మూడు పింక్‌బాల్‌ టెస్టుల్లో కోహ్లీనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతను ఆడిన మూడు డే/నైట్‌ టెస్టుల్లో 60.25 మెరుగైన సగటుతో 241 పరుగులు చేశాడు. దీంతో ఈ జాబితాలో అందరికన్నా ముందున్నాడు. తర్వాత రోహిత్‌ రెండు టెస్టుల్లో 112 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే శనివారం నుంచి ప్రారంభమయ్యే మరో పింక్‌బాల్‌ టెస్టులో వీరిద్దరు ఎలా ఆడతారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.\

 మూడేళ్ల నిరీక్షణకు తెరపడేనా?

మూడేళ్ల నిరీక్షణకు తెరపడేనా?

ఇక డే/నైట్ టెస్టుల్లో భారత్ తరఫున విరాట్ కోహ్లీ ఒక్కడే సెంచరీ చేశాడు. అది కూడా 2019లో కోల్‌కతా వేదికగా నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి పింక్‌ బాల్‌ టెస్టులోనే శతకం సాధించాడు. అయితే కోహ్లీకి అదే చివరి సెంచరీ కావడం గమనార్హం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరో సెంచరీ బాదలేదు. టెస్ట్‌ల్లోనే కాదు ఇతర ఫార్మాట్లలోనూ అతను శతకం సాధించలేకపోయాడు. ఇక ఇటీవల మొహాలి వేదికగా జరిగిన తొలి టెస్టులోనూ 45 పరుగులతో ఆకట్టుకున్నా.. చివరికి హాఫ్ సెంచరీ ముందు ఔటయ్యాడు. దీంతో వందో టెస్టులోనైనా శతకం సాధిస్తాడని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది. అయితే, శనివారం నుంచి లంకతో ప్రారంభమయ్యే రెండో టెస్టులోనైనా విరాట్ సెంచరీ చేస్తాడా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

 మరో 25 రన్స్ చేస్తే..

మరో 25 రన్స్ చేస్తే..

ఇక ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మరో 25 పరుగులు సాధిస్తే టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మార్క్‌వా, గ్యారీ సోబర్స్‌లను వెనక్కినెడుతాడు. ప్రస్తుతం 8007 రన్స్‌తో కోహ్లీ ఉండగా.. మార్క్‌వా(8029), గ్యారీ సోబర్స్(8032) అతనికన్నా ముందున్నారు. ఇక రోహిత్‌ శర్మ గతేడాది అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన పింక్‌బాల్‌ టెస్టులో 66 పరుగులతో రాణించాడు. అతను కూడా ఈ లంకతో జరిగే రెండో మ్యాచ్‌లో బ్యాట్‌ ఝుళిపిస్తే భారీ పరుగులు చేసే అవకాశం ఉంది. దీంతో పింక్‌బాల్‌ టెస్టుల్లో కోహ్లీని అధిగమించి అత్యధిక పరుగులు చేసే వీలుంది. అతడి అభిమానులు సైతం ఇదే ఆశిస్తున్నారు.

IND vs SL : Sunil Gavaskar Advices Rohit Sharma To Avoid His Favourite Shot | Oneindia Telugu
అశ్విన్‌ను ఊరిస్తున్న రికార్డు..

అశ్విన్‌ను ఊరిస్తున్న రికార్డు..

మరోవైపు బౌలింగ్‌ విభాగంలో రవిచంద్రన్‌ అశ్విన్‌ ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన చేస్తే స్పిన్‌ దిగ్గజం అనిల్‌కుంబ్లేకు చెందిన ఓ అరుదైన రికార్డును సమం చేస్తాడు. గత మ్యాచ్‌లో అతడు టీమ్‌ఇండియా తరఫున అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన జాబితాలో కపిల్‌ దేవ్‌ (434)ను అధిగమించి రెండో స్థానానికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాబోయే మ్యాచ్‌లోనూ మరోసారి బంతితో మాయ చేస్తే భారత్‌లో అత్యధికసార్లు ఐదు వికెట్లు సాధించిన కుంబ్లే (25) సరసన నిలుస్తాడు. అదే రెండు ఇన్నింగ్స్‌ల్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేస్తే కుంబ్లేనే అధిగమించి కొత్త చరిత్ర సృష్టిస్తాడు.

Story first published: Friday, March 11, 2022, 17:41 [IST]
Other articles published on Mar 11, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+