IND vs SL: భారత్ 193 ఆలౌట్.. శ్రీలంక లక్ష్యం ఎంతంటే..?
శ్రీలంకతో తొలి టెస్ట్‌లో టీమిండియా 372 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. నాలుగో రోజు ఆటలో దూకుడుగా ఆడిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 48.5 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్(69 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. దేవదత్ పడిక్కల్(75 బంతుల్లో 6 ఫోర్లతో 44) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
శ్రీలంక బౌలర్లలో అసితా ఫెర్నాండో(4/31) నాలుగు వికెట్లు తీయగా.. ప్రబాత్ జయసూర్య(3/43) మూడు వికెట్లు పడగొట్టాడు. కేశర నువాంత ఒక వికెట్ తీయగా.. లాహిరు కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 178 పరుగల భారీ ఆధిక్యం సాధించడంతో శ్రీలంక ముందు 372 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది.
నాలుగో రోజు ఆటలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. యశస్వి జైస్వాల్.. మూడో బంతికే డకౌట్ కాగా.. కేఎల్ రాహుల్(35), దేవదత్ పడిక్కల్(44) వేగంగా పరుగులు చేశారు. ఈ క్రమంలో రాహుల్‌ను ప్రభాత్ జయసూర్య ఔట్ చేయగా.. పడిక్కల్(44)ను కేశర నువంత పెవిలియన్ చేర్చాడు. దాంతో భారత్ 116/4 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.

రెండో సెషన్ ఆరంభంలోనే ధ్రువ్ జురెల్ ఔటైనా.. రవీంద్ర జడేజాతో(9) రిషభ్ పంత్ దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో 53 బంతుల్లో రిషభ్ పంత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శతకం దిశగా సాగిన పంత్(66)ను లాహిరు కుమార ఔట్ చేశాడు. పంత్ వికెట్ తర్వాత భారత ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది. అయితే మూడో సెషన్ ఆటకు వర్షం అంతరాయం కలిగిస్తోంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు కుప్పకూలింది. దేవదత్ పడిక్కల్(230 బంతుల్లో 15 ఫోర్లు, సిక్స్‌తో 167) సెంచరీతో రాణించగా.. కేఎల్ రాహుల్(175 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 82) శతకాన్ని చేజార్చుకున్నాడు. ధ్రువ్ జురెల్(68 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.
శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య(4/109) నాలుగు వికెట్లు తీయగా.. కేశర నువాంత(3/175) మూడు వికెట్లు పడగొట్టాడు. అసితా ఫెర్నాండో(2/63) రెండు వికెట్లు తీసాడు. అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 79.4 ఓవర్లలో 284 పరుగులకు కుప్పకూలింది. సోనాల్ దినుషా(100) సెంచరీతో చెలరేగగా.. నిరోషన్ డిక్‌వెల్లా(115 బంతుల్లో 7 ఫోర్లతో 80) హాఫ్ సెంచరీతో రాణించాడు. మానవ్ సుతార్(4/76), రవీంద్ర జడేజా(3/57) అద్వితీయమైన బౌలింగ్ ప్రదర్శనతో శ్రీలంక పతనాన్ని శాసించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
