రవీంద్ర జడేజా చెత్త రికార్డ్.. ఏకంగా 88 నోబాల్స్!
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చెత్త రికార్డ్ నమోదు చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో అతి తక్కువ కాలంలో అత్యధిక నోబాల్స్ వేసిన ఆటగాడిగా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. 2021 నుంచి టెస్ట్‌ల్లో జడేజా 88 నోబాల్స్ వేసాడు. శ్రీలంకతో రెండో టెస్ట్‌లో జడేజా మొత్తం నాలుగు నోబాల్స్ వేసాడు. తొలి ఇన్నింగ్స్‌లో మూడు నోబాల్స్ వేసిన జడేజా.. రెండో ఇన్నింగ్స్‌లో ఒకటి వేసాడు.
తొలి టెస్ట్‌లోనూ జడేజా నాలుగునో బాల్స్ వేసాడు. ఇన్నింగ్స్‌కు రెండు చొప్పున నోబాల్స్ సంధించాడు. ఇందులో ఒకటి ధనంజయ డి సిల్వాకు లైఫ్‌లైన్‌గా మారింది. దాంతో టెస్టు క్రికెట్‌లో ఒక స్పిన్నర్ అత్యధిక నో బాల్స్ వేసిన చెత్త రికార్డును జడేజా మూటగట్టుకున్నాడు. జడేజా తర్వాత రెండో స్థానంలో పాకిస్థాన్ స్పిన్నర్ నోమన్ అలీ ఉన్నాడు.

టెస్టుల్లో స్పిన్నర్ల నో బాల్స్ రికార్డు
88 - రవీంద్ర జడేజా
40 - నోమన్ అలీ
33 - లసిత్ ఎంబుల్డెనియా
19 - జాక్ లీచ్
17 - జోమెల్ వారికన్
17 - జహీర్ ఖాన్
రెండో టెస్ట్‌లో జడేజాతో సహా భారత బౌలర్లంతా 10 నోబాల్స్ వేసారు. అఫ్గానిస్థాన్(14) తర్వాత అత్యధిక నోబాల్స్ వేసిన జట్టుగా భారత జట్టు అప్రతిష్టను మూటగట్టుకుంది.
గెలుపు ముంగిట భారత్..
ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుపు ముంగిట నిలిచింది. 213 పరుగుల భారీ లోటుతో ఫాలో ఆన్ ఆడిన శ్రీలంక నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 72.4 ఓవర్లలో 6 వికెట్లకు 229 పరుగులు చేసింది. క్రీజులో కేశర నువాంత(3 బ్యాటింగ్), సోనాల్ దినుషా(7 బ్యాటింగ్) ఉన్నారు.
తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో ఆకట్టుకున్న సోనాల్ దినుషాను ఔట్ చేస్తే భారత విజయం లాంఛనం కానుంది. ప్రస్తుతం శ్రీలంక 16 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆఖరి రోజైన గురువారం శ్రీలంకను వీలైనంత త్వరగా ఆలౌట్ చేస్తే భారత్ విజయం సులువు అవుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

