IND vs SL: సెంచరీతో తన కెప్టెన్‌కు నివాళులర్పించిన రవీంద్ర జడేజా (వీడియో)

మొహాలీ: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సెంచరీతో కదం తొక్కిన టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(219 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్స్‌లతో 162 బ్యాటింగ్) తన కెప్టెన్ షేన్ వార్న్‌కు ఘన నివాళులర్పించాడు. సెంచరీ పూర్తయిన వెంటనే బ్యాట్‌ను కత్తిలా తిప్పుతూ తన ట్రేడ్ మార్క్ సెలెబ్రేషన్స్ చేసుకున్న జడేజా.. ఆకాశంలోకి చూస్తూ షేన్ వార్న్‌కు నివాళులర్పించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఐపీఎల్ అరంగేట్ర సీజన్‌లో రవీంద్ర జడేజాను రాజస్థాన్ రాయల్స్ రూ.12 లక్షలకు తీసుకుంది. అప్పుడే విరాట్ కోహ్లీ సారథ్యంలోని అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన జట్టులో జడేజా కీలక సభ్యుడు.
వార్న్ సారథ్యంలోనే..
ఇక షేన్ వార్న్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ అరంగేట్ర టైటిల్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే. అరంగేట్ర సీజన్‌లోనే 14 మ్యాచ్‌లు ఆడిన జడేజా.. 135 పరుగులు చేశాడు. లోయరార్డర్‌లో బ్యాటింగ్ చేస్తూ జట్టుకు కావాల్సిన భారీ షాట్లు ఆడాడు. ఇక బౌలింగ్‌లో వికెట్ తీయకపోయినా.. వార్న్ మెళకువలతో మేటి స్పిన్నర్‌గా ఎదిగాడు. ఈ క్రమంలోనే వార్న్‌కు జడేజా తన సెంచరీని అంకితమిస్తూ నివాళులర్పించాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. తాము గర్వపడేలా చేశావ్ జడేజా అంటూ ట్వీట్ చేసింది.
రాక్ స్టార్ బిరుదు వార్న్ ఇచ్చిందే..
2008 ఐపీఎల్ సందర్భంగానే రవీంద్ర జడేజాకు షేన్ వార్న్ రాక్ స్టార్ బిరుదు ఇచ్చాడు. జట్టులో అత్యంత యువ ఆటగాడైన జడేజాకు షేన్ వార్న్ వరుస అవకాశాలిచ్చాడు. అతని సిక్స్ హిట్టింగ్ సామర్థ్యాన్ని, బౌలింగ్ వైవిధ్యాన్ని పసిగట్టిన వార్న్ సీనియర్లను కాదని అతన్ని వరుసగా ఆడించాడు. జడేజాకు కూడా వార్న్ నమ్మకాన్ని నిలబెడుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

థాయ్‌లాండ్‌లో..
తన స్పిన్ మాయాజాలంతో ప్రపంచకప్ క్రికెట్‌ను శాసించిన షేన్ వార్న్(52) శుక్రవారం హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. థాయ్‌లాండ్‌లో ప్రముఖ టూరిస్ట్ ప్లేస్ అయిన కో సముయ్‌లోని ఓ విల్లా గదిలో అచేతనంగా పడి ఉన్న వార్న్‌ను చూసిన సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆలస్యం కావడంతో వార్న్‌ను కాపాడేందుకు వైద్యులు చేసిన కృషి ఫలించలేదు. క్వీన్స్‌లాండ్‌లో మృతి చెందిన లెజెండ్ ప్లేయర్ రాడ్ మార్ష్(74)కు సంతాపం తెలిపిన కొన్ని గంటలకే వార్న్ మరణించం క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది.
స్పిన్ కింగ్‌గా..
15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో వార్న్ ఎన్నో ఘనతలు సాధించాడు. కాగా 1992 నుంచి 2007 వరకు ఆస్ట్రేలియా తరపున 145 టెస్టులు ఆడిన షేన్ వార్న్ 708 వికెట్లు సాధించాడు. ఇందులో ఐదు వికెట్ల ఘనతను 37 సార్లు, 10 వికెట్ల ఘనతను 10 సార్లు అందుకున్నాడు. 194 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. 1992లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన షేన్ వార్న్.. 2007లో వీడ్కోలు పలికాడు.

భారత్ 574/8 డిక్లెర్డ్..
శ్రీలంకతో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్‌లో టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 574/8 వద్ద డిక్లేర్ ఇచ్చింది. రవీంద్ర జడేజా(228 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స్‌లతో 175 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. రవిచంద్రన్ అశ్విన్(82 బంతుల్లో 8 ఫోర్లతో 61) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరూ ఏడో వికెట్‌కు 130 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. ఇక తొలి రోజు ఆటలో రిషభ్ పంత్(97 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 96) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. హనుమ విహారీ(58) హాఫ్ సెంచరీతో మెరిసాడు. అయితే జడేజా డబుల్ సెంచరీ చేసిన తర్వాత డిక్లేర్ ఇవ్వాల్సిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications