
మొహాలీ: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో టాలీవుడ్ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ సందడి చేశారు. విరాట్ కోహ్లీ 100వ టెస్ట్ నేపథ్యంలో చివరి నిమిషంలో ఈ మ్యాచ్‌కు 25 శాతం మంది అభిమానులను బీసీసీఐ అనుమతించిన విషయం తెలిసిందే. దాంతో ఈ మ్యాచ్‌కు హాజరైన అభిమానులు.. పుష్ప డైలాగ్స్ ప్లకార్డులతో గ్యాలరీలో రచ్చ చేశారు.
ఈ మ్యాచ్ రెండో రోజు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా( 228 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స్‌లతో 175 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత బోర్డును పరుగెత్తించాడు. దాంతో అతని సెంచరీని పుష్ప ఫేమస్ డైలాగ్ 'తగ్గేదేలే'(జుకేగా నహీ)తో సెలెబ్రేట్ చేసుకున్నారు.
ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో రవీంద్ర జడేజా.. వికెట్ తీసిన అనంతరం తన చేతిని గడ్డం కింద నిమురుతూ.. తగ్గేదేలే అనే డైలాగ్‌తో సెలెబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక సెలెబ్రేషన్ ఫొటోలను తాజా టెస్ట్ మ్యాచ్ ప్లకార్డుల్లో ప్రదర్శించిన అభిమానులు .. జడేజా సెంచరీ తర్వాత సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా అజేయ శతకానికి తోడు రవిచంద్రన్ అశ్విన్(82 బంతుల్లో 8 ఫోర్లతో 61) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరూ ఏడో వికెట్‌కు 130 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించగా.. మహమ్మద్ షమీ(20 నాటౌట్)తో కలిసి జడేజా 9వ వికెట్‌కు 103 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దాంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 574/8 భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. ఇక తొలి రోజు ఆటలో రిషభ్ పంత్(97 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 96) ధనాధన్ ఇన్నింగ్స్‌తో తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. హనుమ విహారీ(58) హాఫ్ సెంచరీతో మెరిసాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక అప్పుడే రెండు వికెట్లు కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో ఓపెనర్ లాహిరి తిరమణ్నే(17) ఎల్బీగా వెనుదిరగ్గా.. జడేజా బౌలింగ్‌లోకెప్టెన్ దిముత్ కరుణరత్నే(28) వికెట్ల ముందు దొరికిపోయాడు. క్రీజులో పాతుమ్ నిస్సంక(16 బ్యాటింగ్), ఏంజెలో మాథ్యూస్(22 బ్యాటింగ్) ఉన్నారు. 34 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక 2 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది.