
కొలంబో: టీమిండియా యువ స్పిన్నర్ రాహుల్ చాహర్ అసాధారణ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. శ్రీలంకతో బుధవారం జరిగిన రెండో టీ20లో బౌండరీ లైన్ వద్ద మైమరిపించే ఫీల్డింగ్ విన్యాసంతో ఔరా అనిపించాడు. అతని సూపర్ ఫీల్డింగ్‌కు శ్రీలంక డేంజరస్ ఓపెనర్ అవిష్కా ఫెర్నాండో(11) నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. దాదాపు సిక్సర్‌గా వచ్చిన బంతిని చాకచక్యంగా అందుకున్న రాహుల్.. 6 పరుగులు సేవ్ చేయడంతో పాటు కీలక వికెట్‌లో భాగమయ్యాడు.
భువనేశ్వర్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్ నాలుగో బంతిని ఫెర్నాండో ఫైన్ లెగ్ దిశగా భారీ షాట్ ఆడాడు. బంతి దాదాపు సిక్సర్‌గా దూసుకెళ్లింది. కానీ ఆ దిశగా ఫీల్డింగ్ చేస్తున్న రాహుల్ చాహర్.. బౌండరీ లైన్ మీద అద్భుతంగా అందుకున్నాడు. అయితే సమన్వయం కోల్పోతున్నానని గ్రహించిన అతను బంతిని గాల్లోకి విసిరేసి మళ్లీ తిరిగి వచ్చి అందుకున్నాడు. ఈ తరహా క్యాచ్‌లు ఈ రోజుల్లో సర్వసాధారణమైనప్పటికీ.. ఈ సిరీస్‌లో మాత్రం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఈ వీడియోకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఈ సూపర్ క్యాచ్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 132 రన్స్ మాత్రమే చేసింది. శిఖర్ ధావన్(40), దేవదత్ పడిక్కల్(29), రుతురాజ్ గైక్వాడ్(21) పర్వాలేదనిపించగా మిగతా బ్యాట్స్‌మన్ విఫలమయ్యారు. లంకబౌలర్లలో అకిలా ధనుంజయ రెండు వికెట్లు తీయగా.. చమీరా, హసరంగా, షనక తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం శ్రీలంక 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 133 పరుగులు చేసి థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. ధనుంజయ డిసిల్వాకు తోడుగా మినోద్ భానుక(36) రాణించాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, చేతన్ సకారియా, వరుణ్ చక్రవర్తీ, రాహుల్ చాహర్ తలో వికెట్ తీయగా.. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీసాడు. ఓ దశలో భారత్ విజయం ఖాయమనిపించగా.. ధనుంజయ కడవరకు నిలిచి సైలెంట్‌గా మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు.