For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SL: పాపం.. పృథ్వీ షాను విస్మరించిన సెలెక్టర్లు.. డాషింగ్ ఓపెనర్ భావోద్వేగం!

IND vs SL: Prithvi Shaw again ignored by selectors, posts video of Gaur Gopal Das learnings

న్యూఢిల్లీ: టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షాను సెలెక్టర్లు మరోసారి విస్మరించారు. శ్రీలంకతో సొంతగడ్డపై జరగనున్న మూడు టీ20లు, వన్డేల సిరీస్‌లకు వేర్వేరు జట్లను బీసీసీఐ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు జట్లలో పృథ్వీ షాకు అవకాశం దక్కలేదు. ఇటీవల దేశవాళీ క్రికెట్‌లో పృథ్వీ షా వెనుకబడినా.. గత రికార్డులను పరిగణలోకి తీసుకోలేదు. అంతేకాకుండా శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ సూపర్ ఫామ్‌లో ఉండటంతో పృథ్వీ షాకు దారులు మూసుకుపోయాయి.

రెండేళ్ల క్రితం..

రెండేళ్ల క్రితం..

2021లో శ్రీలంకతో చివరిసారిగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన పృథ్వీ షా.. అప్పటి నుంచి జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నా.. ద్వితీయ శ్రేణి జట్టులో కూడా సెలెక్టర్లు అవకాశం ఇవ్వడం లేదు. మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తరహాలో ధాటిగా ఆడగలిగే పృథ్వీ షాకు మంచి భవిష్యత్తు ఉందని గతంలో చాలా మంది మాజీ క్రికెటర్లు మెచ్చుకున్నారు. కానీ జట్టులో నెలకొన్న తీవ్ర పోటీ నేపథ్యంలో షా అవకాశం అందుకోలేకపోతున్నాడు.

బరువు తగ్గినా..

బరువు తగ్గినా..

గతంలో సెలెక్టర్లు విస్మరించినప్పుడల్లా.. సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో స్పందించిన పృథ్వీ షా ఈ సారి కూడా తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. బరువు తగ్గి ఫిట్‌గా మారిన సెలెక్టర్లు పట్టించుకోవడం లేదని గతంలో ఆవేదన వ్యక్తం చేసిన పృథ్వీ షా.. అదే కోపంలో దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సెంచరీతో చెలరేగాడు. అయినా సెలెక్టర్లు పట్టించుకోలేదు. వీరేంద్ర సెహ్వాగ్ వంటి మాజీ క్రికెటర్లు.. పృథ్వీ షాను టీమిండియా ఓపెనర్‌గా తీర్చిదిద్దాలని సూచిస్తున్నా.. సెలెక్టర్లు పట్టించుకోవడం లేదు.

స్వామిజీ సూక్తులతో..

స్వామిజీ సూక్తులతో..

గతంలో సాయి బాబా అంటూ సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన పృథ్వీ షా.. తాజాగా గౌర్ గోపాల్ దాస్ గురూజీ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. 'ఎవరైనా నవ్వుతూ ఉంటే వారు సంతోషంగా ఉన్నట్లు కాదు. సమస్యలు ఆకస్మాత్తుగా వచ్చినట్లు ఆనందం రాదు. ప్రేమ, సంతోషం, సానుకూలతలను ఎంచుకుంటే కోపం, ద్వేషం, ప్రతికూలత మనష్యుల్లో ఆటోమెటిక్‌గా వస్తాయి. ప్రేమ, సానుకూలతను ఎంచుకోవడానికే మనం మనుషులుగా పుట్టాం'అనే వ్యాఖ్యలను షేర్ చేశాడు.

ఐర్లాండ్ వెళ్లి ఆడుకో..

ఐర్లాండ్ వెళ్లి ఆడుకో..

భారత క్రికెట్‌కు గుడ్ బై చెప్పి ఐర్లాండ్ టీమ్ తరఫున ఆడామని పృథ్వీ షాకు అభిమానులు సూచిస్తున్నారు. ఇక్కడే ఉంటే టాలెంట్ తొక్కేస్తారని.. మరో ఉన్ముక్త్ చంద్‌లా తయారవుతావని హెచ్చరిస్తున్నారు. ఇక శ్రీలంకతో టీ20 సిరీస్‌కు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా ఎంపికవ్వగా.. వన్డేలతో కెప్టెన్ రోహిత్ శర్మ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. రిషభ్ పంత్, శిఖర్ ధావన్‌పై వేటు వేసిన సెలెక్టర్లు శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్‌లకు అవకాశం కల్పించింది.

Story first published: Wednesday, December 28, 2022, 14:57 [IST]
Other articles published on Dec 28, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+