India vs Sri Lanka: శ్రీలంకతో తొలి వన్డే.. 35 ఏళ్ల వయసులో ధావన్ అరుదైన రికార్డు! దాదా రికార్డుపై గబ్బర్ కన్ను

కొలంబో: భారత్-శ్రీలంక జట్ల మధ్య ఆదివారం (జూన్ 18) నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం ఇందుకు వేదిక కానుంది. మధ్యాహ్నం మూడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మూడు వన్డేలతో పాటు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కూడా ఇదే స్టేడియంలో జరగనుంది. టెస్టు సిరీస్ కోసం భారత సీనియర్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుండగా.. పూర్తిగా యువకులతో కూడిన పరిమిత ఓవర్ల జట్టు శ్రీలంకలో పర్యటిస్తోంది. యువ జట్టుకు సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ సారథ్యం వహిస్తుండగా.. స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

35 ఏళ్ల వయసులో కెప్టెన్సీ:
ఆదివారం శ్రీలంకతో జరగనున్న తొలి వన్డే ద్వారా శిఖర్ ధావన్ ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరనుంది. లేటు వయసులో జట్టు పగ్గాలు అందుకున్న భారత కెప్టెన్‌గా గబ్బర్ నిలవనున్నాడు. 35 సంవత్సరాల 225వ రోజు ధావన్ టీమియా పగ్గాలు అనుకోనున్నాడు. దీంతో 1984లో తొలిసారిగా భారత జట్టుకు నాయకత్వం వహించిన మొహిందర్ అమర్‌నాథ్ రికార్డును బద్దలు కొట్టనున్నాడు. పాకిస్థాన్‌పై 34 సంవత్సరాల 37 రోజుల వయసులో అమర్‌నాథ్ తొలిసారిగా టీమిండియాకు నాయకత్వం వహించాడు. సయ్యద్ కిర్మానీ (33 సంవత్సరాల 353 రోజులు), అజిత్ వాడేకర్ (33 సంవత్సరాలు 103 రోజులు)లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
India vs England: భాయ్.. సెలవులు ముగిశాయి! ఇక పని మొదలు పెట్టాలి: రోహిత్

23 పరుగులు చేస్తే:
వన్డేల్లో భారత జట్టుకి నాయకత్వం వహించిన 25వ కెప్టెన్‌గా శిఖర్ ధావన్ రికార్డుల్లోకి ఎక్కనున్నాడు. వన్డేలో 6000 పరుగులు పూర్తి చేయడానికి అతడికి మరో 23 పరుగులు అవసరం. తొలి వన్డేలో 23 పరుగులు చేస్తే.. 6000 వన్డే పరుగులు పూర్తి చేసిన 5వ భారత ఓపెనర్‌గా ధావన్ రికార్డు సృష్టిస్తాడు. ఇక 35 పరుగులు చేస్తే.. 10000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన 14వ భారత బ్యాట్స్‌మన్‌గా నిలవనున్నాడు. 17 రన్స్ చేస్తే.. శ్రీలంకపై 1000 పరుగులు పూర్తిచేస్తాడు. ఇన్నింగ్స్ పరంగా వేగంగా 1000 వన్డే పరుగులు పూర్తిచేసిన ఆటగాడిగా నిలవనున్నాడు.

దాదా రికార్డుపై గబ్బర్ కన్ను:
6000 వన్డే పరుగులు సాధించిన రెండో వేగవంతమైన భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచే అవకాశం శిఖర్ ధావన్ ముందుంది. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. 136 ఇన్నింగ్స్‌లలో కోహ్లీ 6000 వన్డే పరుగులు చేశాడు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 147 ఇన్నింగ్స్‌లలో 6000 వన్డే పరుగులు సాధించాడు. ఇప్పటివరకు ధావన్ 139 వన్డే ఇన్నింగ్స్ ఆడి 5977 రన్స్ చేశాడు. తొలి వన్డేలో 23 రన్స్ చేస్తే.. దాదా రికార్డు బద్దలు కానుంది. రెండో స్థానానికి గబ్బర్ దూసుకురానున్నాడు.

స్వల్ప మార్పులు:
వాస్తవానికి ఈ నెల 13 నుంచే సిరీస్ ప్రారంభంకావాల్సి ఉంది. కానీ శ్రీలంక బ్యాటింగ్ కోచ్, డేటా అనలిస్ట్ ఇటీవల కరోనా వైరస్ బారినపడటంతో.. సిరీస్‌ని ఐదు రోజులు వాయిదా వేశారు. మూడు వన్డేలు వరుసగా జులై 18, 20, 23.. మూడు టీ20లు 25, 27, 29 తేదీల్లో జరుగనున్నాయి. ఇక మ్యాచ్‌ల ప్రారంభ సమయాల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఇంతకుముందు షెడ్యూల్ ప్రకారం వన్డే మ్యాచ్‌లు మధ్యాహ్నం 2:30 గంటలకు.. టీ20లు సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కావాలి. ఇప్పుడు మధ్యాహ్నం 3, రాత్రి 8 గంటలకు మ్యాచులు స్టార్ అవ్వనున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications