IND vs SL:ఓయ్ రోహిత్ ఇది పద్దతేనా? నీ దోస్త్ కోసం ఇషాన్ కిషన్‌ను బలి చేస్తారా? ఫ్యాన్స్ ఫైర్!

తిరువనంతపురం: శ్రీలంకతో ఆఖరి వన్డేలోనూ టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు అవకాశం దక్కలేదు. ఈ మ్యాచ్‌లో రెండు మార్పులతో బరిలోకి దిగిన టీమిండియా.. హార్దిక్ పాండ్యా, ఉమ్రాన్ మాలిక్‌లకు విశ్రాంతినిచ్చి సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్‌లను తుది జట్టులోకి తీసుకుంది.
వాస్తవానికి శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్‌లకు విశ్రాంతినిచ్చి సూర్య, ఇషాన్ కిషన్‌లు అవకాశమిస్తారని అంతా ఆశించారు. సిరీస్ కూడా గెలవడంతో టీమ్‌మేనేజ్‌మెంట్ బెంచ్ ఆటగాళ్ల సత్తా పరీక్షిస్తోందనుకున్నారు. కానీ రోహిత్ శర్మ మాత్రం అందుకు భిన్నంగా సూర్య ఒక్కడినే ఎంపిక చేశాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అభిమానులు.. ఇషాన్ కిషన్‌ను ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు.
వరుసగా మూడు మ్యాచ్‌లా..?
బంగ్లాదేశ్‌తో డబుల్ సెంచరీ బాది సూపర్ ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్‌ను వరుసగా మూడు మ్యాచ్‌ల్లో బెంచ్‌పై కూర్చో బెట్టడం దారుణమని నెటిజన్లు మండిపడుతున్నారు. కేఎల్ రాహుల్ కోసం మంచి నైపుణ్యం కలిగిన ఇషాన్ కిషన్‌కు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేఎల్ రాహుల్ కారణంగా టీమిండియా రెండు ప్రపంచకప్‌లు ఓడినా.. అతనికి వరుసగా అవకాశాలు ఇవ్వడం ఏంటని నిలదీస్తున్నారు. అతని జిడ్డు బ్యాటింగ్ జట్టుకు నష్టం చేస్తుందని, ఇషాన్ కిషన్ వంటి బిగ్ హిట్టింగ్ సామర్థ్యం కలిగిన ఆటగాళ్లకు టీమ్‌మేనేజ్‌మెంట్ అండగా నిలవాలని సూచిస్తున్నారు.
రాహుల్‌ను నమ్ముకుంటే నష్టమే..
సిరీస్ గెలిచినా.. ఇషాన్ కిషన్ వంటి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకపోవడం వెనుక ఉన్న లాజిక్ ఏంటో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ ద్రవిడ్ తన పిచ్చి నిర్ణయాలతో టీమిండియాను నాశనం చేస్తున్నాడని మండిపడుతున్నారు. ముందు కేఎల్ రాహుల్‌ను జట్టులో నుంచి తప్పించాలని లేకుంటే జట్టుకు తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. రాహుల్‌ను కీపర్‌గా మార్చి ప్రపంచకప్ కోసం సన్నదం కావడం దెబ్బకొడుతుందని అభిప్రాయపడుతున్నారు. రాహుల్‌ను నమ్ముకుంటే నట్టేట మునిగినట్లేనని, అతని వల్ల భారత జట్టుకు నష్టమే తప్పా.. కలిసొచ్చిందేం లేదని సూచిస్తున్నారు.
అందుకే ఇషాన్‌కు నో చాన్స్..
ఇక ఇషాన్ కిషన్‌కు అవకాశం దక్కకపోవడానికి ప్రధాన కారణం.. న్యూజిలాండ్‌తో రెండు సిరీస్‌లకు కేఎల్ రాహుల్ దూరంగా ఉండటమేనని తెలుస్తోంది. తన ప్రేయసి అతియా శెట్టిని రాహుల్ ఈ నెల 23న పెళ్లి చేసుకోబోతున్నాడు. దాంతో అతను న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు దూరంగా ఉన్నాడు. రాహుల్ గైర్హాజరీలో ఇషాన్ కిషన్ ప్రధాన వికెట్ కీపర్‌గా జట్టులో కొనసాగనున్నాడు. ఈ కారణంతోనే ఇషాన్ కిషన్‌ను బెంచ్‌పై కూర్చోబెట్టినట్లు తెలుస్తోంది.
టీమిండియా శుభారంభం..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు శుభారంభం లభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(49 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42) శుభ్ మన్ గిల్(58 బ్యాటింగ్) సూపర్ బ్యాటింగ్‌తో తొలి వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. హాఫ్ సెంచరీ ముంగిట రోహిత్ ఔటైనా.. విరాట్ కోహ్లీ(25 బ్యాటింగ్)తో కలిసి శుభ్‌మన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. ఇప్పటికే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న శుభ్‌మన్ తన క్లాస్ ఆటతో స్కోర్ బోర్డును పరుగెత్తిస్తున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications