For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SL:సిరాజ్, కుల్దీప్ కోతి వేశాలు! అంపైర్‌నే ఆటపట్టిస్తూ.. (వీడియో)

IND vs SL: Mohammed Siraj and Kuldeep Yadav imitate umpire out signal

ధర్మశాల: టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్, సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఈ ఇద్దరికి తుది జట్టులో అవకాశం దక్కలేదు. దాంతో ఈ ఇద్దరు ఆటగాళ్లు వాటర్ బాయ్స్‌గా టీమిండియాకు సేవలందించారు. ఈ క్రమంలోనే మైదానంలోకి వచ్చిన ఈ ఇద్దరు ఆటగాళ్లు అంపైర్‌నే ఆటపట్టించారు. తమ కోతి వేశాలతో నవ్వులు పూయించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..

శ్రీలంక ఇన్నింగ్స్ సందర్భంగా యుజ్వేంద్ర చాహల్ వేసిన 10వ ఓవర్‌లో ఈ సరదా ఘటన చోటు చేసుకుంది. చాహల్ వేసిన ఫుల్లర్ బాల్‌ను అసలంక స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ మిస్‌టైమ్ అయిన బంతి అసలంక ప్యాడ్లను తాకింది. దాంతో భారత ఆటగాళ్లు ఎల్బీ కోసం గట్టిగా అప్పీల్ చేశారు. అంపైర్ కూడా ఎలాంటి సందేహం వ్యక్తం చేయకుండా ఔటిచ్చాడు. ఇక ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శ్రీలంక రివ్యూ తీసుకుంది. ఇక రిప్లేలోబంతి బ్యాట్‌ను తాకకపోగా.. వికెట్లను తాకుతున్నట్లు కనిపించింది. దాంతో అంపైర్ తన నిర్ణయానికి కట్టుబడుతూ ఔట్ సిగ్నల్ ఇచ్చాడు.

అంపైర్‌ను ఇమిటేట్ చేస్తూ..

అయితే అంపైర్ ఔట్ సిగ్నల్ ఇచ్చే ముందు మైదానంలోకి పరుగెత్తుకుంటా వచ్చిన సిరాజ్.. అంపైర్ కన్నా ముందే అతని తలపై ఔట్ సిగ్నల్ చూపిస్తూ వెళ్లాడు. అతని వెనుకాలనే వచ్చిన కుల్దీప్ యాదవ్ సైతం దాన్నే అనుకరించాడు. ఈ క్రమంలో కుల్దీప్‌కు అంపైర్ చేతి తగలగా.. అతనే సారీ చెప్పాడు. ఇక ఈ ఇద్దరి చేష్టలతో అక్కడున్నవారంతా నవ్వుకున్నారు. అయితే ఏదో బెట్టింగ్ పెట్టుకున్నట్లే ఇద్దరు వచ్చి అలా అంపైర్ ఇమిటేట్ చేశారు.

కోతి పనులకు బ్రాండ్ అంబాసిడర్లు..

ఈ ఇద్దరిపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కోతి పనులకు మీరే బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నట్లున్నారు కదా? అని కామెంట్ చేస్తున్నారు. టీమ్‌లో అల్లరి బ్యాచ్‌కు ఈ ఇద్దరే లీడర్స్ ఉన్నట్లునారని ఇంకొందరు కామెంట్ చేశారు. అంతకముందు రెండో టీ20 మ్యాచ్‌కు లక్నో నుంచి ధర్మశాలకు బస్సులో బయలుదేరిన సమయంలో సిరాజ్‌, కుల్దీప్‌లు షారుక్‌ ఖాన్‌ ఫేమస్‌ సాంగ్‌..'' కిస్‌కా హై ఏ తుమ్‌కో ఇంతిజర్‌ మైన్‌ హు నా'' పాట పాడారు. ఈ వీడియోనూ బీసీసీఐ అభిమానులతో పంచుకుంది.

IND vs WI : India 2-0 Lead In T20I Series,Rohit Lauds At Bhuvneshwar Kumar | Oneindia Telugu
జడేజా, శ్రేయస్ మెరుపులు..

జడేజా, శ్రేయస్ మెరుపులు..

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. పతుమ్‌ నిసాంకా (53 బంతుల్లో 11 ఫోర్లతో 75) అర్ధసెంచరీ సాధించగా, గుణతిలక (29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) రాణించాడు. చివర్లో డసన్ షనక (19 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 47 నాటౌట్‌) చెలరేగిపోవడంతో లంకకు భారీ స్కోరు సాధ్యమైంది.

అనంతరం భారత్‌ 17.1 ఓవర్లలోనే 3 వికెట్లకు 186 పరుగులు చేసి అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా 11వ విజయం నమోదు చేసుకుంది. 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' శ్రేయస్‌ అయ్యర్‌ (44 బం తుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 74 నాటౌట్‌), జడేజా (18 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 45 నాటౌట్‌), శాంసన్ (25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39) మెరుపు ఇన్నింగ్స్‌లు జట్టును గెలిపించాయి. చివరి టి20 నేడు ఇదే మైదానంలో జరుగుతుంది.

Story first published: Sunday, February 27, 2022, 12:17 [IST]
Other articles published on Feb 27, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+