IND vs SL: అంపైర్ల నిర్ణయం శ్రీలంకకు కలిసొచ్చింది: మానవ్ సుతార్
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో 178 పరుగుల భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. మానవ్ సుతార్(4/76), రవీంద్ర జడేజా(3/57) అద్వితీయమైన బౌలింగ్ ప్రదర్శనతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 79.4 ఓవర్లలో 284 పరుగులకు కుప్పకూలింది. సోనాల్ దినుషా(100) సెంచరీతో చెలరేగగా.. నిరోషన్ డిక్‌వెల్లా(115 బంతుల్లో 7 ఫోర్లతో 80) హాఫ్ సెంచరీతో రాణించాడు.
నాలుగు వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించిన మానవ్ సుతార్ మూడో రోజు ఆట అనంతరం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా రవీంద్ర జడేజాపై ప్రశంసల జల్లు కురిపించిన మానవ్ సుతార్.. అంపైర్ నిర్ణయాలు కొన్ని శ్రీలంకకు కలిసొచ్చాయని తెలిపాడు. శ్రీలంక ద్వయం సోనల్ దినూష్, నిరోషన్ డికెవెల్లా అద్వితీయమైన బ్యాటింగ్‌తో ఆరో వికెట్‌కు 146 పరుగులు జోడించినప్పటికీ.. భారత జట్టు తమ ప్రణాళికలకు కట్టుబడి ఉందని మానవ్ సుతార్ చెప్పాడు.

అంపైర్ల నిర్ణయాలు నష్టం చేశాయి..
'తొలి సెషన్‌లో ప్రణాళికలకు తగ్గట్లుగానే బౌలింగ్ చేయాలని అనుకున్నాం. గేమ్ ఆసాంతం బంతి బాగా స్పిన్ అయ్యింది. సెకండ్ సెషన్‌లో శ్రీలంక అద్భుతంగా ఆడింది. అయితే మా బౌలింగ్ విధానంలో ఎలాంటి మార్పులు జరగలేదు. అంపైర్లు తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా మాకు నష్టం చేశాయి. శ్రీలంకకు అనుకూలంగా మారాయి. శ్రీలంక బ్యాటర్లు సమర్థవంతంగా పరుగులు రాబట్టారు. బంతి కూడా అంత సులువుగా పాతగా మారలేదు.
ఏది ఏమైనా సరైన ప్రదేశాల్లో బంతిని వేయడం మా వ్యూహం. మాది చాలా సరళమైన ప్రణాళిక. బంతి లైన్‌ను సరిగ్గా అంచనా వేసి, స్టంప్ టు స్టంప్ బౌలింగ్ చేయడమే ఏకైక లక్ష్యం. జడేజా నుంచి నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది. ఒకే చోట నిలకడగా.. కచ్చితంగా బౌలింగ్ చేయగల అతని వరల్డ్ క్లాస్ ఎబిలిటీ అద్భుతం.'అని మానవ్ సుతార్ చెప్పుకొచ్చాడు.
జడేజా అరుదైన ఘనత..
టెస్ట్ క్రికెట్‌లో 350 వికెట్ల మైలురాయి అందుకున్న ఐదో భారత ఆటగాడిగా జడేజా నిలిచాడు. అంతేకాకుండా టెస్ట్‌ల్లో 4000 ప్లస్ రన్స్ 350 వికెట్లు తీసిన నాలుగో ఆల్‌రౌండర్‌గా రికార్డ్ సాధించాడు. అతని కన్నా ముందు కపిల్ దేవ్, ఇయాన్ బోథమ్, డేనియల్ వెటోరి మాత్రమే ఈ ఫీట్ సాధించారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు కుప్పకూలింది. దేవదత్ పడిక్కల్(230 బంతుల్లో 15 ఫోర్లు, సిక్స్‌తో 167) సెంచరీతో రాణించగా.. కేఎల్ రాహుల్(175 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 82) శతకాన్ని చేజార్చుకున్నాడు. ధ్రువ్ జురెల్(68 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య(4/109) నాలుగు వికెట్లు తీయగా.. కేశర నువాంత(3/175) మూడు వికెట్లు పడగొట్టాడు. అసితా ఫెర్నాండో(2/63) రెండు వికెట్లు తీసాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

