Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: మానవ్ సుతార్ సిక్సర్.. శ్రీలంకపై భారత్ ఘన విజయం!

శ్రీలంక పర్యటనను టీమిండియా ఘనంగా ప్రారంభించింది. గాలె వేదికగా బుధవారం ముగిసిన తొలి టెస్ట్‌లో సమష్టిగా రాణించిన భారత్ 165 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. యువ స్పిన్నర్ మానవ్ సుతార్(6/55, 4/76)10 వికెట్ల ప్రదర్శనతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.

84/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను కొనసాగించిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 206 పరుగులకు కుప్పకూలింది. ఓవర్‌నైట్ బ్యాటర్లు ధనంజయ డిసిల్వా(151 బంతుల్లో 7 ఫోర్లతో 59), సోనాల్ దినుషా (129 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 84) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.

మానవ్ సుతార్ సిక్సర్..

భారత బౌలర్లలో మానవ్ సుతార్(6/55) ఆరు వికెట్లు తీయగా.. ప్రసిధ్ కృష్ణ(2/16) రెండు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసారు. ఈ విజయంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

IND vs SL Manav Suthar 10-Wicket Haul Helps India Beat Sri Lanka by 165 Runs in Galle Test vs Sri Lanka

ఆఖరి రోజు ఆటలో డిసిల్వా, సోనాల్ దినుషా భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించినా.. జడేజా ఈ జోడీని విడదీసి ఐదో వికెట్‌కు నమోదైన 95 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. కేశర నువాంతతో కలిసి సోనాల్ దినుషా పోరాడినా.. మానవ్ సుతార్‌ దెబ్బతీసాడు. వరుస బంతుల్లో సోనాల్ దినుషా, ప్రబాత్ జయసూర్యను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాతి ఓవర్లలో లాహిరు కుమార, కేశర నువాంతలను ఔట్ చేసి భారత్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

భారత్ 462 ఆలౌట్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు కుప్పకూలింది. దేవదత్ పడిక్కల్(230 బంతుల్లో 15 ఫోర్లు, సిక్స్‌తో 167) సెంచరీతో రాణించగా.. కేఎల్ రాహుల్(175 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 82) శతకాన్ని చేజార్చుకున్నాడు. ధ్రువ్ జురెల్(68 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.

శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య(4/109) నాలుగు వికెట్లు తీయగా.. కేశర నువాంత(3/175) మూడు వికెట్లు పడగొట్టాడు. అసితా ఫెర్నాండో(2/63) రెండు వికెట్లు తీసాడు. అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 79.4 ఓవర్లలో 284 పరుగులకు కుప్పకూలింది. సోనాల్ దినుషా(100) సెంచరీతో చెలరేగగా.. నిరోషన్ డిక్‌వెల్లా(115 బంతుల్లో 7 ఫోర్లతో 80) హాఫ్ సెంచరీతో రాణించాడు. మానవ్ సుతార్(4/76), రవీంద్ర జడేజా(3/57) అద్వితీయమైన బౌలింగ్ ప్రదర్శనతో శ్రీలంక పతనాన్ని శాసించారు.

శ్రీలంక ముందు భారీ లక్ష్యం..

భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 48.5 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్(69 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. దేవదత్ పడిక్కల్(75 బంతుల్లో 6 ఫోర్లతో 44) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శ్రీలంక బౌలర్లలో అసితా ఫెర్నాండో(4/31) నాలుగు వికెట్లు తీయగా.. ప్రబాత్ జయసూర్య(3/43) మూడు వికెట్లు పడగొట్టాడు. కేశర నువాంత ఒక వికెట్ తీయగా.. లాహిరు కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 178 పరుగల భారీ ఆధిక్యం సాధించడంతో శ్రీలంక ముందు 372 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది.


సంక్షిప్త స్కోర్లు..

భారత్ తొలి ఇన్నింగ్స్ 462 ఆలౌట్ (దేవదత్ పడిక్కల్ 167, కేఎల్ రాహుల్ 82, ప్రబాత్ జయసూర్య 4/109)

శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 284 ఆలౌట్( సొనాల్ దినుషా 100, నిరోషణ్ డిక్‌వెల్లా 80)

భారత్ రెండో ఇన్నింగ్స్ 193 ఆలౌట్(రిషభ్ పంత్ 66, దేవదత్ పడిక్కల్ 44)

శ్రీలంక రెండో ఇన్నింగ్స్ 206 ఆలౌట్ (ధనంజయ డిసిల్వా 59 , సోనాల్ దినుషా 84)

Story first published: Wednesday, August 19, 2026, 14:03 [IST]
Other articles published on Aug 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+