
టాప్-3 ఫ్లాఫ్ షో..
స్వల్ప లక్ష్యచేధనకు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. తొలి వన్డేలో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మ(17), శుభ్‌మన్ గిల్(21).. సెంచరీ హీరో విరాట్ కోహ్లీ(4) పవర్ ప్లేలోనే వెనుదిరిగారు. కరుణరత్నే వేసిన 5వ ఓవర్‌లో రోహిత్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరగ్గా.. లాహిరు కుమార్ వేసిన మరుసటి ఓవర్‌లో శుభ్‌మన్ వెనుదిరిగాడు. 10వ ఓవర్‌లో లాహిరు కుమార హార్డ్ లెంగ్త్ డెలివరీకి విరాట్ కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో భారత్ పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది.

ఆదుకున్న రాహుల్, పాండ్యా..
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడారు. పూర్తిగా డిఫెన్స్‌కు పరిమితమైన ఈ జోడీ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేసిన శ్రేయస్ అయ్యర్(28)ను కసున్ రజితా వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. రివ్యూ తీసుకున్న అంపైర్ కాల్స్‌తో ఫలితం లేకపోయింది. క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యాతో రాహుల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. పరిస్థితులకు తగ్గట్లు ఆడిన ఈ జోడీ పూర్తిగా డిఫెన్స్‌కు పరిమితమైంది. రాహుల్ అయితే టెస్ట్ బ్యాటింగ్ చేశాడు.

అక్షర్ మెరుపులు..
ఐదో వికెట్‌కు 65 పరుగులు జోడించిన అనంతరం హార్దిక్ పాండ్యా(36) కరుణరత్నే ఔట్ చేయగా.. అక్షర్ పటేల్(21) సాయంతో రాహుల్ పోరాడాడు. ఓ సిక్స్, బౌండరీతో జోరు కనబర్చిన అక్షర్ పటేల్.. అదే జోరులో క్యాచ్ ఔటయ్యాడు. క్రీజులోకి కుల్దీప్ యాదవ్ రాగా.. కేఎల్ రాహుల్ 93 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మూడు బౌండరీలతో రాహుల్ విజయం ముంగిట నిలపగా.. కుల్దీప్ విన్నింగ్ షాట్‌తో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.


Click it and Unblock the Notifications












