
రోహిత్ శర్మ దూరం..
బొటన వేలి గాయంతో బాధపడుతున్న రోహిత్ శర్మ ఈ రెండు సిరీస్‌లకు అందుబాటులో ఉంటాడా? లేదా? అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. రోహిత్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని ఈ రెండు సిరీస్‌లకు కూడా పక్కనపెట్టడమే ఉత్తమమని బీసీసీఐ మెడికల్ టీమ్ సూచించినట్లు తెలుస్తోంది. ఒక వేళ రోహిత్ అందుబాటులో లేకపోతే వైస్ కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్ సారథ్య బాధ్యతలు చూడాల్సి ఉంటుంది.
అయితే రాహుల్ వరుసగా విఫలమవుతుండటంతో అతనిపై వేటు వేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్ నుంచి రాహుల్ దారుణంగా విఫలమవుతున్నారు. అంతేకాకుండా ఈ సిరీస్‌లకు దూరంగా ఉంటానని అతనే.. బీసీసీఐకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

అతియాతో రాహుల్ పెళ్లి..
వచ్చే నెలలో బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టితో కేఎల్ రాహుల్ ఏడడుగులు వేయనున్నాడు. అందుకే తనను ఈ సిరీస్‌కు పరిగణనలోకి తీసుకోవద్దని సెలక్టర్లకు రాహుల్ ఇప్పటికే చెప్పేశాడట. దీంతో శ్రీలంకతో టీ20 సిరీస్‌కు టీమ్‌ఇండియా కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేస్తారనే ప్రచారం జరుగుతోంది.
టీమిండియా మ్యాచ్‌లను ప్రసారం చేసే స్టార్ స్పోర్ట్స్ టీ20 సిరీస్ ప్రోమో కూడా అందుకు బలాన్నిచేకూరుస్తోంది. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ను ప్రమోట్ చేస్తూ స్టార్ స్పోర్ట్స్ ఓ వీడియోని రూపొందించి 'నూతన సంవత్సరంలో శ్రీలంకతో సిరీస్‌ని ఆడేందుకు హార్దిక్ పాండ్యా సిద్ధమవుతున్నాడు. కొత్త టీమిండియా యాక్షన్‌ను చూసేందుకు సిద్ధమవ్వండి'అని స్టార్ స్పోర్ట్స్ ట్వీట్ చేసింది.

విరాట్ కోహ్లీకి విశ్రాంతి..
వచ్చే ఏడాది సొంతగడ్డపై ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో సిరీస్‌లు ఉన్న నేపథ్యంలో విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖరారు కావాలంటే ఆస్ట్రేలియాను ఓడించడం టీమిండియాకు అవసరం. ఈ సిరీస్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీసీఐ.. సీనియర్ ఆటగాళ్ల గాయాలపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ నేపథ్యంలోనే బుమ్రా, జడేజాలను కూడా ఆపుతున్నట్లు సమాచారం.

పంత్ ఔట్.. సంజూ ఇన్..
పరిమిత ఓవర్లలలో పేలవ ఫామ్ కనబరుస్తున్న రిషభ్ పంత్‌పై కూడా వేటు పడనున్నట్లు సమాచారం. సంజూ శాంసన్‌తో పాటు డబుల్ సెంచరీ హీరో ఇషాన్ కిషన్ టీ20 జట్టులో చోటు దక్కించుకోనున్నారు. విధ్వంసకర ఓపెనర్ పృథ్వీషాకు కూడా ఈ సిరీస్‌కు పిలుపు అందనున్నట్లు తెలుస్తోంది. జనవరి 3(ముంబై), జనవరి 5(పుణే), జనవరి 7(రాజ్‌కోట్)తేదీల్లో మూడు టీ20లు జరగనుండగా.. జనవరి 10(గౌహతి), జనవరి 12(కోల్‌కతా), జనవరి 15(త్రివేండ్రం)న మూడు వన్డేల సిరీస్ జరగనుంది.


Click it and Unblock the Notifications
