Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: వన్డే సిరీస్‌ ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ.. బుమ్రా మళ్లీ దూరం!

IND vs SL: Jasprit Bumrah set to miss ODI series against Sri Lanka over BCCI’s big U-turn on Yorker specialist

హైదరాబాద్: శ్రీలంకతో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అనివార్య కారణాలతో ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. బుమ్రా రీఎంట్రీ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) యూటర్న్ తీసుకుంది. భవిష్యత్తు టోర్నీల నేపథ్యంలో బుమ్రా రీఎంట్రీ విషయంలో తొందరపాటు పనికి రాదని భావించిన బోర్డు.. చివరి నిమిషంలో అతన్ని జట్టు నుంచి తొలగించింది. దాంతో బుమ్రా తొలి వన్డే జరిగే గౌహతికి ఇంకా చేరుకోలేదు. అయితే బుమ్రా గైర్హాజరీపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

ముందుగా లేకున్నా..

ముందుగా లేకున్నా..

ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో రిహాబిలిటేషన్‌లో ఉన్న బుమ్రా.. బీసీసీఐ తాజా నిర్ణయంతో అక్కడే ఉండిపోయాడు. వాస్తవానికి శ్రీలంకతో ముందుగా ఎంపిక చేసిన జట్టులో బుమ్రా లేడు. అతను పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో ఆలిండియా సెలెక్షన్ కమిటీ శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసింది.

బీసీసీఐ సైతం బుమ్రా ఎంపికపై అధికారిక ప్రకటన చేసింది. 'శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ఆలిండియా సెలెక్షన్ కమిటీ జస్‌ప్రీత్ బుమ్రాను ఎంపిక చేసింది'అని జనవరి 3న ప్రకటించింది. గత అనుభవం, భవిష్యత్తు టోర్నీల నేపథ్యంలో బుమ్రా ఎంపికపై యూటర్న్ తీసుకుంది.

ఆస్ట్రేలియా సిరీస్ నేపథ్యంలోనే..

ఆస్ట్రేలియా సిరీస్ నేపథ్యంలోనే..

గతేడాది సెప్టెంబర్‌ నుంచి జట్టుకు దూరంగా ఉన్న బుమ్రా.. సమీప భవిష్యత్తులో కీలక సిరీస్‌లు (ఆస్ట్రేలియాతో టెస్ట్‌ సిరీస్‌, వన్డే వరల్డ్‌కప్‌) ఆడాల్సి ఉన్నందున మరోసారి గాయాల బారిన పడకుండా ఉండాలని బీసీసీఐ ఉద్దేశపూర్వకంగా అతన్ని తప్పించినట్లు తెలుస్తోంది. లంకతో వన్డే సిరీస్‌ కోసం ఎంపిక చేసిన జట్టులో పేసర్‌ స్థానానికి ఎటూ పోటీ ఉన్నందున రిస్క్‌ తీసుకోవడం ఎందుకని భావించి బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం.

ఒకవేళ ఆసీస్‌తో టెస్ట్‌ సిరీస్‌కు ముం‍దే బుమ్రాను బరిలోకి దించాలని బీసీసీఐ భావిస్తే.. జనవరి 18 నుంచి న్యూజిలాండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లో అతనికి అవకాశం ఇవ్వవచ్చు.

రోహిత్ రీఎంట్రీ..

రోహిత్ రీఎంట్రీ..

ఇక టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న సీనియర్లు రోహిత్‌ శర్మ, వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌ ఇప్పటికే తొలి వన్డేకు వేదిక అయిన గౌహతికి చేరుకున్నారు. ముమ్మరంగా సాధన చేస్తున్నారు. బంగ్లాదేశ్ పర్యటనలో చేతి వేలి గాయంతో జట్టుకు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ ఈ సిరీస్‌తోనే రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు ఈ సిరీస్ నుంచే సన్నాహకాలు మొదలు పెట్టనున్నారు.

లంకతో వన్డేలకు భారత జట్టు

లంకతో వన్డేలకు భారత జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్

Story first published: Monday, January 9, 2023, 14:37 [IST]
Other articles published on Jan 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+