Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: భారత వన్డే జట్టులో కీలక మార్పు.. స్టార్ పేసర్ రీఎంట్రీ!

 IND vs SL: Jasprit Bumrah included in Indias squad for the ODI series against Sri Lanka

న్యూఢిల్లీ: శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు.. భారత వన్డే జట్టులో కీలక మార్పు చేసింది. గాయం కారణంగా జట్టుకు దూరమైన స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో లంకతో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. చివరిసారిగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో ఆడిన బుమ్రా.. వెన్నుకు సంబంధించిన స్ట్రెస్ రియాక్షన్ కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్ కప్‌కు సైతం దూరమైన బుమ్రా.. రిహాబిలిటేషన్ కోసం ఎన్‌సీఏలో చేరాడు. కాగా బుమ్రా ఫిట్‌నెస్ సాధించాడని ఎన్‌సీఏ ప్రకటించింది.

శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్‌ సింగ్‌లను భారత్ ఎంపిక చేసింది. భారత్, శ్రీలంక మధ్య తొలి వన్డే జనవరి 10 గుహాటిలో జరగనుంది. వచ్చే నెలలో ఆస్ట్రేలియా నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బుమ్రా రాక.. టీమిండియాకు కచ్చితంగా బలాన్నిస్తోంది. బుమ్రా 2019 నుంచి వెన్ను సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నాడు. అప్పట్లో మైన్ స్ట్రెస్ ఫ్రాక్చర్ ఏర్పడింది. దీంతో మూడు నెలలపాటు ఆటకు దూరమయ్యాడు.

2022లో వెన్ను సమస్య కారణంగానే బుమ్రా ఆసియా కప్ ఆడలేకపోయాడు. టీ20 వరల్డ్ కప్‌ కోసం ప్రకటించిన జట్టులో బుమ్రా పేరును సైతం బీసీసీఐ చేర్చింది. టోర్నీ ప్రారంభం నాటికి అతను ఫిట్‌నెస్ సాధిస్తాడని భావించినప్పటికీ.. బుమ్రా కోలేకోలేదు. దీంతో మహ్మద్ షమీని టీ20 వరల్డ్ కప్‌కు రీప్లేస్‌మెంట్‌గా ప్రకటించింది. ఇటీవలే గాయం నుంచి కోలుకున్న బుమ్రా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. శ్రీలంకతో వన్డే సిరీస్‌లో బుమ్రా బరిలోకి దిగితే ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌కు ముందు అతడికి ప్రాక్టీస్‌లా ఉపయోగపడనుంది.

శ్రీలంకతో వన్డే సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్.

Story first published: Tuesday, January 3, 2023, 18:44 [IST]
Other articles published on Jan 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+