For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SL: ఇషాన్ కిషన్ షాన్‌దార్ ఇన్నింగ్స్.. ధోనీ, పంత్ రికార్డు బ్రేక్!

IND vs SL: Ishan Kishan Breaks Rishabh Pant And MS Dhoni’s Record In The First T20I

లక్నో: టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. శ్రీలంకతో గురువారం జరిగిన తొలి టీ20 హాఫ్ సెంచరీతో చెలరేగిన ఇషాన్(56 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 89).. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్‌గా గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు రిషభ్ పంత్ రికార్డును అధిగమించాడు. టీ20ల్లో వికెట్​ కీపర్​గా అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రిషభ్ పంత్​( 65), కేఎల్ రాహుల్​ (57), ధోనీ (56) ఇషాన్ కిషన్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

2017లో బెంగళూరు వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ధోనీ 56 పరుగులు చేసి వికెట్‌ కీపర్‌గా ఒక మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవగా.. ఆ రికార్డును రిషభ్ పంత్‌ అధిగమించాడు. 2019లో వెస్టిండీస్‌పై 42 బంతుల్లో 65 పరుగులతో ధోనిని వెన్కక్కినెట్టాడు. తాజాగా ఇషాన్‌ కిషన్‌ ధోనీ, పంత్‌లను భారీ మార్జిన్‌తో అధిగమించి తొలి స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించాడు.

శ్రీలంకతో టీ20 సిరీస్​కు రిషభ్​ పంత్​కు విశ్రాంతినివ్వగా, కేఎల్​ రాహుల్​ గాయపడ్డాడు. తొలి మ్యాచ్​లో కెప్టెన్ రోహిత్​ శర్మతో కలిసి మెుదటి వికెట్​కు 111 పరుగుల భాగస్వామ్యాన్ని ఇషాన్ కిషన్ నెలకొల్పాడు ​. రోహిత్​ (32 బంతుల్లో 44) పర్వాలేదనిపించాడు. శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్​ 62 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీస్కోరు చేసింది. 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' ఇషాన్‌ కిషన్‌ (56 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 89) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57 నాటౌట్‌), రోహిత్‌ శర్మ (32 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 44) మెరుపులు మెరిపించారు. అనంతరం శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులకే పరిమితమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. చరిత్‌ అసలంక (47 బంతుల్లో 5 ఫోర్లతో 53 నాటౌట్‌) ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్, వెంకటేశ్ అయ్యర్ రెండేసి వికెట్లు తీయగా.. జడేజా, చాహల్ చెరొక వికెట్ పడగొట్టారు.

Story first published: Friday, February 25, 2022, 14:34 [IST]
Other articles published on Feb 25, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+