అర్ధరాత్రి ఆసుపత్రికి..
దాంతో ఇషాన్ కళ్లు బైర్లు కమ్మాయి. వెంటనే టీమిండియా ఫిజియో వచ్చి పరీక్షించాడు. అంతా బాగానే ఉందని చెప్పి ఇషాన్ బ్యాటింగ్ కొనసాగించగా.. అతను ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు. బంతి తాకిన ఎఫెక్ట్ ఏమో కానీ లాహీరు వేసిన మరుసటి ఓవర్‌లోనే సింపుల్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. గతంలో ఇతర ఆటగాళ్లకు తాకిన మాదిరే ఇషాన్ కిషన్‌కు కూడా బంతి తాకిందని అంతా భావించారు.
కానీ ఈ గాయం ఎఫెక్ట్ ఇషాన్‌కు మ్యాచ్ ముగిసిన తర్వాత తెలిసిందట. అర్థరాత్రి అతను కొంత అస్వస్థతకు గురవ్వడంతో ఇషాన్ కిషన్‌ను హుటాహుటినా ఆసుపత్రికి తరలించారని దైనిక్ జాగరన్ పేర్కొంది. ఐసీయూ వార్డ్‌లో ఉంచి చికిత్స అందించారని, ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపింది. అయితే ఇషాన్ కిషన్ గాయంపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
వైద్య పరీక్షల కోసమే..
ఇక ముందస్తు చర్యల్లో భాగంగానే ఇషాన్ కిషన్‌ను ఆసుపత్రికి తరలించామని, బంతి తలకు తగలడంతో పలు వైద్య పరీక్షలు జరిపించామని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. ఇషాన్ కిషన్‌తో పాటు శ్రీలంక ప్లేయర్ దినేశ్ చండీమల్‌ను కూడా ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు పేర్కొంది. ఈ గాయం నేపథ్యంలో ఇషాన్ కిషన్ నేడు జరిగే మూడో టీ20కి దూరమయ్యే అవకాశాలున్నాయి. రుతురాజ్ గైక్వాడ్ కూడా దూరమవ్వడంతో బ్యాకప్ ఓపెనర్‌గా జట్టులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్‌కు చోటు దక్కనుంది.

చెలరేగిన శ్రేయస్ అయ్యర్..
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. పతుమ్ నిసాంకా (53 బంతుల్లో 11 ఫోర్లతో 75) అర్ధసెంచరీ సాధించగా, గుణతిలక (29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) రాణించాడు. చివర్లో డసన్ షనక (19 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 47 నాటౌట్) చెలరేగిపోవడంతో లంకకు భారీ స్కోరు సాధ్యమైంది.
అనంతరం భారత్ 17.1 ఓవర్లలోనే 3 వికెట్లకు 186 పరుగులు చేసి అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా 11వ విజయం నమోదు చేసుకుంది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' శ్రేయస్ అయ్యర్ (44 బం తుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 74 నాటౌట్), జడేజా (18 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 45 నాటౌట్), శాంసన్ (25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39) మెరుపు ఇన్నింగ్స్‌లు జట్టును గెలిపించాయి. చివరి టి20 నేడు ఇదే మైదానంలో జరుగుతుంది.


Click it and Unblock the Notifications












