టీ20 ప్రపంచకప్ 2024ను గెలుచుకున్న టీమిండియా.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలవడంపై ఫోకస్ పెట్టింది. నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. పర్యవేక్షణలో ఆ దిశగా సన్నాహకాలను కూడా ప్రారంభించింది. శ్రీలంక పర్యటనలోని మూడు వన్డేల సిరీస్‌తోనే మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఈ సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లంతా అందుబాటులో ఉండాలని గంభీర్ పట్టుబట్టాడు. కానీ ఈ సిరీస్‌లో టీమిండియాకు ఊహించని పరాజయం ఎదురైంది.
మూడు వన్డేల్లో టీమిండియా ఒక్క విజయం కూడా సాధించలేకపోయింది. తొలి మ్యాచ్‌ను టై చేసుకున్న భారత్.. చివరి రెండు మ్యాచ్‌ల్లో ఘోర పరాజయాలను చవిచూసింది. దాంతో మూడు వన్డేల సిరీస్‌ను శ్రీలంక 2-0తో కైవసం చేసుకుంది. 27 ఏళ్ల తర్వాత భారత్‌పై వన్డే సిరీస్ గెలిచింది.

ఎన్నో అంచనాలతో కోచ్‌గా బాధ్యతల చేపట్టిన గంభీర్.. తొలి వన్డే సిరీస్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. కోచ్‌గా అతను తీసుకున్న నిర్ణయాలు టీమిండియా కొంపముంచాయి. ఈ ఘోర పరాజయంతో టీమిండియా.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సన్నాహకాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పటిష్టమైన టీమిండియాను గౌతమ్ గంభీర్ నాశనం చేశాడని మరోవైపు ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
గంభీర్ అనవసర ప్రయోగాలు జట్టు ఓటమిని నాశనం చేశాయని కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో గంభీర్ అనేక మార్పులు చేశాడు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం బ్యాటింగ్ ఆర్డర్‌ను పూర్తిగా మార్చేశాడు. తనకు తోచిన నిర్ణయం తీసుకుంటూ.. జట్టు ఓటమికి కారణమయ్యాడు. బౌలింగ్ కాంబినేషన్‌లోనూ గంభీర్ తప్పిదాలు చేశాడు.

స్పిన్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై ఎక్స్‌ట్రా స్పిన్నర్‌ను తీసుకోకుండా స్పెషలిస్ట్ పేసర్లతో బరిలోకి దిగాడు. ఆల్‌రౌండర్లతో మ్యానేజ్ చేయాలని భావించాడు. అంతకుమించి శ్రీలంకను చాలా తక్కువగా అంచనా వేసాడు. అంతేకాకుండా పార్ట్‌టైమ్ బౌలర్లతో బౌలింగ్ చేయించాడు. కానీ ఈ ప్రయోగాలన్నీ బెడిసికొట్టాయి. దాంతో మూడు మ్యాచ్‌ల్లో టీమిండియా దారుణంగా విఫలమైంది.
ఈ ఘోర పరాజయం ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీసింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంకా 6 నెలలు సమయం ఉండగా.. భారత్ మరో మూడు వన్డేలు మాత్రమే ఆడనుంది. ఈ మూడు వన్డేలను గంభీర్ ఎలా ఉపయోగించుకుంటాడనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.