Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నోబాల్స్ తగ్గాలంటే.. టెస్ట్‌ల్లో కూడా ఫ్రీ హిట్ పెట్టాలి: టీమిండియా స్పిన్ కోచ్

టెస్ట్‌ల్లో నోబాల్స్ సంఖ్య తగ్గాలంటే సుదీర్ఘ ఫార్మాట్‌లో కూడా ఫ్రీ హిట్ నిబంధనను అమలు చేయాలని టీమిండియా స్పిన్ కోచ్ సాయిరాజ్ బహుతులే అభిప్రాయపడ్డాడు. రవీంద్ర జడేజా నోబాల్స్‌పై స్పందిస్తూ సరదాగా ఈ వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంకతో కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో రవీంద్ర జడేజా నాలుగు నో బాల్స్ వేసాడు.

IND vs SL: మలుపు తిప్పిన మానవ్ సుతార్, ప్రసిధ్ కృష్ణ.. గెలుపు ముంగిట భారత్!

IND vs SL: మలుపు తిప్పిన మానవ్ సుతార్, ప్రసిధ్ కృష్ణ.. గెలుపు ముంగిట భారత్!

5 ఏళ్లలో 88 నోబాల్స్..

తొలి ఇన్నింగ్స్‌లో మూడు నోబాల్స్ వేసిన జడేజా.. మూడో ఇన్నింగ్స్‌లో ఒకటి వేసాడు. టెస్ట్ ఫార్మాట్‌లో 2021 నుంచి జడేజా ఇప్పటి వరకు 88 నోబాల్స్ వేసాడు. అత్యధిక నోబాల్స్ వేసిన స్పిన్నర్‌గా జడేజా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. అతని తర్వాత పాకిస్థాన్ ప్లేయర్ నొమన్ అలీ 40 నోబాల్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు.

IND vs SL India Spin Coach Sairaj Bahutule Suggests Free Hit in Tests to Reduce No-Balls

శ్రీలంకతో తొలి టెస్ట్‌లోనూ జడేజా నాలుగునో బాల్స్ వేసాడు. ఇన్నింగ్స్‌కు రెండు చొప్పున నోబాల్స్ సంధించాడు. ఇందులో ఒకటి ధనంజయ డి సిల్వాకు లైఫ్‌లైన్‌గా మారింది. రెండో టెస్ట్‌లో జడేజాతో సహా భారత బౌలర్లంతా 10 నోబాల్స్ వేసారు. అఫ్గానిస్థాన్(14) తర్వాత అత్యధిక నోబాల్స్ వేసిన జట్టుగా భారత జట్టు అప్రతిష్టను మూటగట్టుకుంది.

నోబాల్స్‌పై వర్క్ చేస్తున్నాం..

నాలుగో రోజు ఆట అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న టీమిండియా స్పిన్ కోచ్ సాయిరాజ్ బహుతులేను నోబాల్స్ గురించి ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం చెప్పాడు. ఫ్రీ హిట్ నిబంధనను తీసుకొస్తేనే బౌలర్ల తిక్క కుదురుతుందని నవ్వులు పూయించాడు. అయితే ఈ సమస్యను అధిగమించేందుకు వర్క్ చేస్తున్నామని తెలిపాడు. ఎక్స్‌ట్రా ఎఫర్ట్ పెట్టే క్రమంలో కొన్నిసార్లు బౌలర్లు లైన్ ధాటుతారని చెప్పాడు.

'ఈ నోబాల్స్ సమస్యను అధిగమించడంపై ఫోకస్ పెట్టాం. ఇది ఆందోళన కలిగించే విషయమే. అయితే వికెట్లు పడని పరిస్థితుల్లో బౌలర్ ఎక్స్‌ట్రా ఎఫర్ట్ పెట్టే క్రమంలో ఇలా జరుగుతుంటుంది. అయితే ఇది సాకు కాదు. బౌలింగ్ ప్రారంభించే స్థానం గురించి జడేజా, సారాన్ష్ జైన్‌తో కలిసి వర్క్ చేశాం. కానీ కొన్నిసార్లు నిర్దిష్ట బంతి కోసం ఎక్స్‌ట్రా ఎఫర్ట్ పెట్టే సమయంలో ఓవర్ స్టెప్ అవుతున్నారు. ఈ సమస్యను వారు సరిదిద్దుకొని మెరుగవుతారని ఆశిస్తున్నా.

ఫ్రీ హిట్ రూల్ పెట్టాలి..

నేనేం రూల్స్ కాపాడే వ్యక్తిని కాదు. కానీ ఫ్రీ-హిట్ రూల్ గనక వస్తే మాత్రం కచ్చితంగా నో-బాల్స్ తగ్గిపోతాయి. ఏ టీమ్ కూడా ఊరికే నో-బాల్ వేసి.. ఆ అదనపు బాల్‌తో పాటు ఎక్స్‌ట్రా రన్స్ కూడా ఇచ్చుకోవాలని అనుకోదు. నెట్ సెషన్స్‌లోనే బౌలర్లకు వారి టేకాఫ్ పాయింట్స్‌ను గుర్తు చేస్తుంటాం. ప్రాక్టీస్ సెషన్స్‌ను కూడా మ్యాచ్‌లానే సీరియస్‌గా తీసుకుంటాం. పక్కనే ఉండి పర్యవేక్షిస్తాం.

IND vs SL: పంత్, మానవ్ సుతార్ వ్యూహం.. చేజారిన పసిందు శతకం! (వీడియో)

Also Read

IND vs SL: పంత్, మానవ్ సుతార్ వ్యూహం.. చేజారిన పసిందు శతకం! (వీడియో)

ప్రాక్టీస్ సెషన్స్‌లో కొన్ని సార్లు నేను అంపైర్‌గా ఉంటే.. మరికొన్ని సార్లు ఇతర కోచ్‌లు అంపైర్లుగా వ్యవహరిస్తారు. స్పిన్నర్లు, ఫాస్ట్ బౌలర్లను నిశితంగా పర్యవేక్షిస్తాం. కాబట్టి నోబాల్స్‌‌కు కూడా మేం ప్రాధాన్యత ఇస్తా. ఈ తప్పిదం పునరావృతం కాకుండా చూసుకుంటాం.'అని సాయిరాజ్ బహుతులే చెప్పుకొచ్చాడు.

Story first published: Wednesday, August 26, 2026, 21:02 [IST]
Other articles published on Aug 26, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+