IND vs SL వన్డే సిరీస్ రిపోర్ట్ కార్డ్.. ద్రవిడ్‌కు ఫుల్ మార్క్స్! పాండ్యా ఫెయిల్! టాపర్ సూర్య!

హైదరాబాద్: శ్రీలంకతో తొలి రెండు వన్డేల్లో దుమ్మురేపిన టీమిండియా.. నామమాత్రపు చివరి వన్డేలో చేతులెత్తేసింది. ఐదుగురు కొత్త ప్లేయర్లతో బరిలోకి దిగిన గబ్బర్ సేన.. మూడో వన్డేలో మూడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దాంతో సొంతగడ్డపై భారత్ చేతిలో 10 మ్యాచ్‌ల పరాజయాల పరంపరకు తెరదించుతూ ఎట్టకేలకు శ్రీలంక విజయాన్ని అందుకుంది. అయితే తొలి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన భారత్ సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌లో మొత్తం 17 మంది భారత ఆటగాళ్లు బరిలోకి దిగారు. కొందరు మూడు మ్యాచ్‌లు ఆడితే మరికొందరు రెండు మ్యాచ్‌లకే పరిమితమయ్యారు. మరో ఆరుగురు మాత్రం ఒకే మ్యాచ్ ఆడారు. అయితే ఈ సిరీస్‌లో ఆటగాళ్ల భారత ఆటగాళ్లకు పెర్ఫామెన్స్‌కు మార్క్స్ వేస్తే.. కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌కు ఫుల్ మార్క్స్ వేయవచ్చు. యువ జట్టుతో దివాల్ అద్భుత విజయాన్నందించాడు.

సూర్య టాపర్..
ఇక ఆటగాళ్లలో సూర్యకుమార్ యాదవ్ టాపర్ అని చెప్పవచ్చు. మూడు మ్యాచ్‌ల్లో సూర్య అదరగొట్టి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా గెలుచుకున్నాడు. తన అరంగేట్ర మ్యాచ్‌లో 31 పరుగులతో అజేయంగా నిలిచిన సూర్య.. రెండో వన్డేలో హాఫ్ సెంచరీతో రాణించాడు. చివరి వన్డేలోనూ 40 పరగులు చేశాడు. ఈ పెర్ఫామెన్స్ ఆధారంగా అతనికి 10కి 9 మార్కులు ఇవ్వవచ్చు. ఇక పృథ్వీ షా(43, 19, 49) రెండో వన్డేలో విఫలమైనా మిగతా రెండు మ్యాచ్‌ల్లో దుమ్ములేపాడు. అతనికి 8/10 మార్కులు ఇవ్వవచ్చు. తొలి మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన శిఖర్ ధావన్(86 నాటౌట్, 29, 13) తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో మార్క్ పెర్ఫామెన్స్ చూపించలేకపోయాడు. అతని ప్రదర్శనకు 7 మార్కులు వేయవచ్చు.

హార్దిక్, మనీష్ ఫెయిల్..
ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లో అవకాశం అందుకున్న హార్దిక్ పాండ్యా, మనీశ్ పాండ్యా దారుణంగా విఫలమయ్యారు. మనీశ్(26, 31, 11) మూడు వన్డేల్లో విఫలమయ్యాడు. రెండో వన్డేలో దురదృష్టం వెంటాడినా మిగతా మ్యాచ్‌ల్లో నిర్లక్ష్యంగా ఔటయ్యాడు. బంగారంలాంటి అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అతని పెర్ఫామెన్స్ 3/10 మార్క్స్ ఇవ్వవచ్చు. ఇక హార్దిక్ పాండ్యా ఈ మూడు వన్డేల సిరీస్‌లో దారుణాతి దారుణంగా విఫలమయ్యాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ తన మార్క్ పెర్ఫామెన్స్ చూపించలేకపోయాడు. తొలి వన్డేలో బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినా.. రెండో వన్డేలో డకౌటయ్యాడు. మూడో వన్డేలో 19 రన్స్ మాత్రమే చేశాడు. ఈ సిరీస్‌లో మొత్తం 14 ఓవర్లు బౌలింగ్ చేసిన పాండ్యా రెండు వికెట్లు మాత్రమే తీసాడు. దారళంగా పరుగులిచ్చుకున్నాడు. ఈ నిరాశజనక ప్రదర్శనతో సర్వత్రా విమర్శలను ఎదుర్కొంటున్నాడు. అతని పెర్ఫామెన్స్ 3/10 మార్క్స్ ఇవ్వవచ్చు.

దీపక్ సూపర్..
రెండో వన్డేలో వీరోచిత బ్యాటింగ్‌తో చిరస్మరణీయ విజయాన్నందించిన దీపక్ చాహర్(69 నాటౌట్).. అటు బౌలింగ్‌లోనూ అదరగొట్టాడు. 15 ఓవర్లు వేసి 4 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ మెయిడిన్ ఓవర్ కూడా ఉంది. ఆల్‌రౌండ్ షో కనబర్చిన దీపక్‌కు 9/10 మార్క్స్ ఇవ్వవచ్చు. ఫస్ట్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన ఇషాన్ కిషన్, పర్వాలేదనిపించిన భువనేశ్వర్, తొలి వన్డేలో రెండు వికెట్లతో మెరిసిన కుల్దీప్ యాదవ్‌లకు 4/10 మార్క్స్ ఇవ్వవచ్చు. ఇక తనకు అవకాశం దక్కిన రెండు వన్డేల్లో 5 వికెట్లతో సత్తా చాటిన యుజ్వేంద్ర చాహల్ పెర్ఫామెన్స్‌కు 7/10 మార్క్స్ వేయవచ్చు.

అరంగేట్ర ఆటగాళ్లలో..
ఆఖరి వన్డేతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఐదుగురు ఆటగాళ్లలో ముగ్గురు దుమ్ములేపగా.. మరో ఇద్దరు విఫలమయ్యారు. సంజూ శాంసన్ 46 పరుగులతో పాటు కీపింగ్‌లో రాణించగా.. బౌలింగ్‌లో చేతన్ సకారియా, రాహుల్ చాహర్ దుమ్మురేపారు. సకారియా రెండు వికెట్లు తీస్తే చాహర్ మూడు వికెట్లు పడగొట్టాడు. కృష్ణప్ప గౌతమ్ మాత్రం అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌లో నిరాశపరిచాడు. ఒకే ఒక వికెట్ మాత్రమే తీసాడు. నితీశ్ రాణా దారుణంగా విఫలమయ్యాడు. సంజూ శాంసన్ 6/10, చేతన్ సకారియా 6/10, రాహుల్ చాహర్ 7/10, గౌతమ్ 4/10, నితీశ్ రాణా 2/10 మార్క్స్ ఇవ్వవచ్చు. నవ్‌దీప్ సైనీ సైతం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అతనికి 3/10 మార్క్స్ ఇవ్వవచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications