Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: గెలుపు ముంగిట భారత్.. కానీ!

శ్రీలంకతో తొలి టెస్ట్‌లో టీమిండియా విజయం ముంగిట నిలిచింది. కానీ వరణుడిపైనే భారత్ విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయి. బుధవారం ఆఖరి రోజు ఆటలో వరణుడు రెండు సెషన్ల పాటు అంతరాయం కలిగించకపోతే భారత్ విజయం లాంఛనం కానుంది. 372 పరుగుల భారీ లక్ష్య ఛేదన కోసం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 34 ఓవర్లలో 4 వికెట్లకు 84 పరుగులు చేసింది. క్రీజులో ధనంజయ డిసిల్వా(73 బంతుల్లో 3 ఫోర్లతో 31 నాటౌట్), సొనాల్ దినుషా(36 బంతుల్లో 4 ఫోర్లతో 25 నాటౌట్) ఉన్నారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ తలో వికెట్ తీసారు.

భారత్ విజయానికి 6 వికెట్లు కావాల్సి ఉండగా.. శ్రీలంక ఇంకా 288 పరుగులు చేయాల్సి ఉంది. ఆఖరి రోజు ఆటలో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. పిచ్‌పై పూర్తిగా పగుళ్లు ఏర్పడి స్పిన్‌కు అనుకూలించనుంది. వర్షం పడకపోతే తొలి సెషన్‌లో భారత్‌కు విజయం దక్కవచ్చు.

IND vs SL India Edge Closer to Victory Despite Dhananjaya-Sonal Fightback in Galle Test

భారత్ 193 ఆలౌట్..

అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 48.5 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్(69 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. దేవదత్ పడిక్కల్(75 బంతుల్లో 6 ఫోర్లతో 44) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శ్రీలంక బౌలర్లలో అసితా ఫెర్నాండో(4/31) నాలుగు వికెట్లు తీయగా.. ప్రబాత్ జయసూర్య(3/43) మూడు వికెట్లు పడగొట్టాడు. కేశర నువాంత ఒక వికెట్ తీయగా.. లాహిరు కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 178 పరుగల భారీ ఆధిక్యం సాధించడంతో శ్రీలంక ముందు 372 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది.

దూకుడుగా ఆడిన భారత్..

నాలుగో రోజు ఆటలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. యశస్వి జైస్వాల్.. మూడో బంతికే డకౌట్ కాగా.. కేఎల్ రాహుల్(35), దేవదత్ పడిక్కల్(44) వేగంగా పరుగులు చేశారు. ఈ క్రమంలో రాహుల్‌ను ప్రభాత్ జయసూర్య ఔట్ చేయగా.. పడిక్కల్(44)ను కేశర నువంత పెవిలియన్ చేర్చాడు. దాంతో భారత్ 116/4 స్కోర్‌తో లంచ్‌ బ్రేక్‌కు వెళ్లింది.

రెండో సెషన్ ఆరంభంలోనే ధ్రువ్ జురెల్ ఔటైనా.. రవీంద్ర జడేజాతో(9) రిషభ్ పంత్ దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో 53 బంతుల్లో రిషభ్ పంత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శతకం దిశగా సాగిన పంత్‌(66)ను లాహిరు కుమార ఔట్ చేశాడు. పంత్ వికెట్ తర్వాత భారత ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది. అయితే మూడో సెషన్ ఆటకు ముందు వర్షం అంతరాయం కలిగించింది. ఆఖరి సెషన్‌లో భారత్ నిప్పులు చెరగడంతో శ్రీలంక 47 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కెప్టెన్ ధనంజయ డిసిల్వా(73 బంతుల్లో 3 ఫోర్లతో 31 నాటౌట్), సొనాల్ దినుషా(36 బంతుల్లో 4 ఫోర్లతో 25 నాటౌట్) మరో వికెట్ పడకుండా నాలుగో రోజు ఆటను ముగించారు.


సంక్షిప్త స్కోర్లు..

భారత్ తొలి ఇన్నింగ్స్ 462 ఆలౌట్ (దేవదత్ పడిక్కల్ 167, కేఎల్ రాహుల్ 82, ప్రబాత్ జయసూర్య 4/109)

శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 284 ఆలౌట్( సొనాల్ దినుషా 100, నిరోషణ్ డిక్‌వెల్లా 80)

భారత్ రెండో ఇన్నింగ్స్ 193 ఆలౌట్(రిషభ్ పంత్ 66, దేవదత్ పడిక్కల్ 44)

శ్రీలంక రెండో ఇన్నింగ్స్ 84/4 (ధనంజయ డిసిల్వా 31 బ్యాటింగ్, సోనాల్ దినుషా 25 బ్యాటింగ్)

Story first published: Tuesday, August 18, 2026, 19:02 [IST]
Other articles published on Aug 18, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+