Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: ఇలాంటి గేమ్‌ప్లాన్‌తో భారత్‌ గెలవలేదు: హర్షా భోగ్లే

భారత్-శ్రీలంక తొలి టెస్ట్ ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయానికి 6 వికెట్లు కావాల్సి ఉండగా.. శ్రీలంక 288 పరుగులు చేయాలి. బుధవారం ఈ మ్యాచ్‌కు చివరి రోజు. సాధారణంగా ఆఖరి రోజు బౌలింగ్ టీమ్‌కే విజయవకాశాలు ఉంటాయి. కానీ ఈ మ్యాచ్‌పై వర్షం ప్రభావం ఉండటం అభిమానులకు ఆందోళనకు గురి చేస్తోంది. కనీసం రెండు సెషన్ల ఆట సాధ్యమైతేనే ఫలితం తేలనుంది.

ఈ క్రమంలోనే టీమిండియా గేమ్ ప్లాన్‌పై హర్షా భోగ్లే విమర్శలు గుప్పించాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఇంకాస్త దూకుడుగా ఆడాల్సిందని అభిప్రాయపడ్డాడు. 'భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో ఆఖరి 40 నిమిషాల సమయంలో అనుసరించిన వ్యూహం ఏంటో అస్సలు అర్థం కాలేదు. చాలాసేపు దూకుడుగా ఆడకుండా సమయాన్ని వృథా చేశారు.

IND vs SL Harsha Bhogle Slams India s Game Plan Against Sri Lanka in 1st Test Not Quite Sure

వాతావరణం ఎప్పుడూ ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి ఉన్నప్పుడు దూకుడుగా ఆడాల్సింది పోయి.. భారత్ కాస్త ఎక్కువ సమయం తీసుకుంది. అలాగని ఏమైనా పరుగులు చేసిందా అంటే అదీ లేదు.'అని హర్షా భోగ్లే పేర్కొన్నాడు.

భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 48.5 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్(69 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. దేవదత్ పడిక్కల్(75 బంతుల్లో 6 ఫోర్లతో 44) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శ్రీలంక బౌలర్లలో అసితా ఫెర్నాండో(4/31) నాలుగు వికెట్లు తీయగా.. ప్రబాత్ జయసూర్య(3/43) మూడు వికెట్లు పడగొట్టాడు. కేశర నువాంత ఒక వికెట్ తీయగా.. లాహిరు కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 178 పరుగల భారీ ఆధిక్యం సాధించడంతో శ్రీలంక ముందు 372 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది.

అనంతరం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 34 ఓవర్లలో 4 వికెట్లకు 84 పరుగులు చేసింది. క్రీజులో ధనంజయ డిసిల్వా(73 బంతుల్లో 3 ఫోర్లతో 31 నాటౌట్), సొనాల్ దినుషా(36 బంతుల్లో 4 ఫోర్లతో 25 నాటౌట్) ఉన్నారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ తలో వికెట్ తీసారు.

Story first published: Wednesday, August 19, 2026, 10:04 [IST]
Other articles published on Aug 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+