Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: కుల్దీప్ యాదవ్ ఔట్.. గంభీర్ హింట్! రెండో టెస్ట్‌కు భారత తుది జట్టు ఇదే!

శ్రీలంక పర్యటనలో టీమిండియా ఆఖరి పోరుకు సిద్దమైంది. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా కొలంబో వేదికగా జరిగే ఆదివారం ప్రారంభమయ్యే మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంకతో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. తొలి టెస్ట్‌లో 165 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను చిత్తు చేసిన టీమిండియా 1-0తో ఆధిక్యంలో ఉంది.

అదే జోరులో ఆ జట్టును ఓడించి సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో భారత్ ఉంది. మరోవైపు ఆఖరి మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేయాలనే లక్ష్యంతో శ్రీలంక బరిలోకి దిగుతోంది.

కుల్దీప్ యాదవ్‌పై వేటు..

రెండో టెస్ట్‌కు టీమిండియా కాంబినేషన్‌లో మార్పు జరిగే అవకాశం ఉంది. తొలి టెస్ట్‌లో దారుణంగా విఫలమైన కుల్దీప్ యాదవ్‌పై వేటు పడే ఛాన్స్ ఉంది. తొలి టెస్ట్‌లో రెండో ఇన్నింగ్స్‌ల్లో కలిపి కుల్దీప్ యాదవ్ ఒకే ఒక్క వికెట్ తీసాడు. అంతేకాకుండా దారళంగా పరుగులిచ్చాడు. దాంతోనే అతన్ని పక్కనపెట్టి 33 ఏళ్ల సారాన్ష్ జైన్‌కు అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.

IND vs SL Gautam Gambhir Hints at Kuldeep Yadav s Exclusion From India s Playing XI for 2nd Test

గంభీర్ హింట్..

శనివారం జరిగిన మీడియా సమావేశంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా కుల్దీప్ యాదవ్ వేటుపై హింట్ ఇచ్చాడు. కుల్దీప్ గురించి ప్రశ్నించగా.. 20 వికెట్లు తీయగల బౌలింగ్ కాంబినేషన్‌‌పైనే భారత తుది జట్టు ఎంపిక ఆధారపడి ఉందని స్పష్టం చేశాడు.

కొన్నిసార్లు కెప్టెన్‌ నిర్ణయంపై కూడా ఆటగాళ్ల ఎంపిక ఆధారపడి ఉంటుందని బదులిచ్చాడు. అయితే కుల్దీప్ యాదవ్‌కు శుభ్‌మన్ గిల్ ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. తొలి టెస్ట్‌లో అతనికి తగిన ఓవర్లు బౌలింగ్ ఇవ్వలేదు. ఈ లెక్కనే కుల్దీప్‌ను పక్కనపెట్టి బ్యాటింగ్ సామర్థ్యం ఉన్న సారాన్ష్ జైన్‌ను ఆడించే అవకాశం ఉంది. మిగతా కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు.

ధ్రువ్ జురెల ఫిట్‌నెస్ సాధించకపోతే సర్ఫరాజ్ ఖాన్‌ బరిలోకి దిగుతాడు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా ఆడనుండగా.. దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్ మిడిలార్డర్‌లో బరిలోకి దిగనున్నారు. స్పెషలిస్ట్ పేసర్లుగా మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ ఆడనున్నారు. ఈ ఇద్దరిలో ఒకరికి విశ్రాంతినిస్తే గుర్నూర్ బ్రార్ జట్టులోకి వస్తాడు.

శ్రీలంకతో రెండో టెస్ట్‌కు భారత తుది జట్టు(అంచనా)

యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్/ సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్/సారాన్ష్ జైన్, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ.

Story first published: Saturday, August 22, 2026, 18:31 [IST]
Other articles published on Aug 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+