Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: మళ్లీ డకౌట్ అయిన సంజూ శాంసన్.. ఇక నిన్ను ఎవ్వడూ కాపాడలేడు!

టీమిండియా వెటరన్ బ్యాటర్ సంజూ శాంసన్ మరో అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ డకౌటయ్యాడు. శ్రీలంకతో రెండో టీ20లో గోల్డెన్ డక్ అయిన సంజూ శాంసన్.. మూడో టీ20లోనూ పరుగులు ఏం చేయకుండానే వెనుదిరిగాడు. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న వికెట్‌పై సంజూ నిలబడలేకపోయాడు.

రెండో టీ20లో శుభ్‌మన్ గిల్ స్థానంలో ఓపెనర్‌గా బరిలోకి దిగి తీవ్రంగా నిరాశపర్చిన సంజూ శాంసన్.. చివరి మ్యాచ్‌లో మాత్రం రిషభ్ పంత్ స్థానంలో జట్టులోకి వచ్చి మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగాడు. కానీ చామిందు విక్రమసింఘే బౌలింగ్‌లో హసరంగాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.

IND vs SL Fans Troll Sanju Samson With Memes For Consecutive Ducks in India vs Sri Lanka T20I Series

సంజూ శాంసన్ వైఫల్యాలపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాక రాక వచ్చిన రెండు అవకాశాలను సంజూ శాంసన్ నేలపాలు చేసుకున్నాడని మండిపడుతున్నారు. దరిద్రానికే సంజూ శాంసన్ బ్రాండ్ అంబాసిడర్ అని సెటైర్లు పేల్చుతున్నారు. సంజూ శాంసన్‌ను ఎవ్వడూ రక్షించలేడని, అతని కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడినట్లేనని అభిప్రాయపడుతున్నారు.

ఓవైపు రిషభ్ పంత్ రీఎంట్రీ.. మరోవైపు ధ్రువ్ జురెల్, జితేశ్ శర్మలతో పోటీ.. మధ్యలో రియాన్ పరాగ్ ఆల్‌రౌండర్ ఎదుగుతుండటంతో సంజూ శాంసన్‌కు జట్టులో దారులు మూసుకుపోయాయి. వికెట్ కీపర్‌గా కాకున్నా.. టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ స్థానంలోనైనా సంజూ శాంసన్‌కు అవకాశం దక్కుతుందని అంతా భావించారు. కానీ అతని చెత్త ప్రదర్శన.. టీమిండియాకు దూరం చేసేలా ఉందని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. 48 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై శ్రీలంక బౌలర్లు నిప్పులు చెరగడంతో భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. యశస్వి జైస్వాల్(10), సంజూ శాంసన్(0), రింకూ సింగ్(1), సూర్యకుమార్ యాదవ్(8), శివమ్ దూబే(13) దారుణంగా విఫలమయ్యారు. వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, రియాన్ పరాగ్ పిచ్‌కు తగ్గట్లు ఆచితూచి ఆడుతున్నారు.

Story first published: Tuesday, July 30, 2024, 21:21 [IST]
Other articles published on Jul 30, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+